EPFO 3.0 Update : ఈపీఎఫ్ఓ బిగ్ అప్‌డేట్.. PF డబ్బులు మొత్తం తీస్తున్నారా? ఏటీఎం, UPIతో ఎంత విత్‌డ్రా చేయొచ్చంటే?

EPFO 3.0 Update : పీఎఫ్ ఖాతాలో డబ్బులు మొత్తం తీసుకోవచ్చా? ఏటీఎం లేదా యూపీఐ ద్వారా ఎలా తీసుకోవాలి? ఎంత వరకు తీసుకోవచ్చు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

EPFO 3.0 Update

  • ఈపీఎఫ్ఓ 3. 0 కొత్త అప్ డేట్ చెక్ చేశారా?
  • మీ పీఎఫ్ అకౌంటులో డబ్బులు విత్ డ్రా చేయాలా?
  • ఏటీఎం లేదా యూపీఐ ద్వారా మొత్తం డబ్బులు తీసుకోవచ్చా?

EPFO 3.0 Update : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ న్యూస్.. మీరు జాబ్ మారిపోయారా? మీ పీఎఫ్ డబ్బులను మొత్తం తీసుకోవాలని అనుకుంటున్నారా? మీ పీఎఫ్ అకౌంట్ కొత్త అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేయాలని చూస్తున్నారా? ఇది మీకోసమే.. మీ పాత కంపెనీ మీ జాబ్ ఎగ్జిట్ తేదీని రిజస్టర్ చేయాలి.

చాలా మంది పీఎఫ్ ఖాతాదారులు తమ జాబ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ఓ తేదీ పోర్టల్‌లో రిజిస్టర్ అయిందో లేదోనని ఆందోళన చెందుతుంటారు. ఇందుకోసం మీ పాత కంపెనీ వద్దకు గానీ లేదా ఏ ప్రభుత్వ ఆఫీసుకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌ను ఉపయోగించి EPFO ​​ఆన్‌లైన్‌లో DOE సులభంగా అప్‌డేట్ చేయవచ్చు.

DOEని ఎందుకు అప్‌డేట్ చేయాలి? :
DOEని అప్‌డేట్ చాలా అవసరం ఎందుకంటే.. DOE అప్‌డేట్ చేయకుండా మీరు పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోలేరు. మీ పింఛను మొత్తాన్ని విత్ డ్రా చేసేందుకు మీరు ఫారం 10C నింపాలి. మీ ఉద్యోగాన్ని వదిలిన తేదీని ఇవ్వాలి. మీ పాత కంపెనీ నుంచి మీ కొత్త ఖాతాకు ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ అకౌంట్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్ఓలో DOEని ఎలా అప్‌డేట్ చేయాలి? :
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో మీరు జాబ్ వదిలేసిన తేదీని అప్‌డేట్ చేయడం చాలా సులభం. మీరు ఈ విధంగా చేయవచ్చు. గూగుల్‌లో ఈపీఎఫ్ఓ ​​కోసం సెర్చ్ చేసి అధికారిక మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌కు వెళ్లండి. మీ UAN నంబర్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.

లాగిన్ అయ్యాక వ్యూ ట్యాబ్‌కు వెళ్లి సర్వీస్ హిస్టరీపై క్లిక్ చేయండి. మీ గత కంపెనీ పేరు పక్కన ఉన్న ఎగ్జిట్ డేట్ ‘అందుబాటులో లేదు’ అని చూపిస్తే వెంటనే అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న మీ కొత్త కంపెనీలో జాయినింగ్ తేదీని గుర్తుపెట్టుకోండి. పాత కంపెనీ నుంచి మానేసిన తేదీ కొత్త కంపెనీలో జాయిన్ అయిన తేదీకి ముందు ఉండాలి.

Read Also : Best Camera Phones : అద్భుతమైన ఫోన్లు భయ్యా.. రూ. 50వేల లోపు 5 బెస్ట్ ట్రిపుల్ కెమెరా ఫోన్లు ఇవే.. ఏది కొంటారంటే?

మేనేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్ ఆప్షన్‌ ఎంచుకోండి. మీరు జాబ్ మానేసిన తేదీని అప్‌డేట్ చేయాలనుకుంటే మీ పాత కంపెనీని డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి. అప్పుడు మీకు చిన్న ఫారం కనిపిస్తుంది. ఉద్యోగం మానేసిన తేదీని ఎంచుకోవాలి. జాబ్ కోసం ‘టెంపరరీ సర్వీసు’ను ఎంచుకోండి.

ఆ తర్వాత, బాక్స్‌ చెక్ చేసి, ‘Request OTP’పై క్లిక్ చేయండి. మీ ఆధార్‌తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీరు OTPని ఎంటర్ చేశాక చేసిన మార్పులతో డేటాను సబ్మిట్ చేయండి. వెంటనే అప్‌డేట్ అవుతుంది. మీరు ఈసర్వీసును చెక్ చేసి కూడా వెరిఫై చేసుకోవచ్చు.

ఈ 5 విషయాలు తప్పనిసరి :
మీరు జాబ్ మానేసిన వెంటనే DOEని అప్‌డేట్ చేయలేరు. మీరు 60 రోజులు ఎదురుచూడాలి. జాబ్ మానేసిన తేదీ నుంచి కొత్త కంపెనీలో చేరే తేదీ కన్నా ముందే ఉండాలి. ఒకవేళ ఈ రెండు తేదీలు వేర్వేగా ఉంటే ఈపీఎఫ్ఓ టెక్నిల్ ఇష్యూగా భావించి మీ ఫండ్స్ నిలిపివేయవచ్చు. డీఓఈని అప్‌డేట్ చేయాల్సి వస్తే.. మీరు జాబ్ మానేసిన అసలు తేదీని ఎంచుకోండి.

మీ DOEని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే.. మీరు జాబ్ ఎందుకు మానేసారు అనే కారణాన్ని అడుగుతారు. మీరు షార్ట్ సర్వీస్ లేదా సెసేషన్ రిటైర్మెంట్ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. తప్పుడు కారణాన్ని ఎంచుకుంటే.. మీ పెన్షన్ పొందడంలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ OTP ఆధారంగా జరుగుతుంది. మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి. ఆ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి.