Best Camera Phones : అద్భుతమైన ఫోన్లు భయ్యా.. రూ. 50వేల లోపు 5 బెస్ట్ ట్రిపుల్ కెమెరా ఫోన్లు ఇవే.. ఏది కొంటారంటే?
Best Camera Phones : మీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టమా? మీకోసం అద్భుతమైన కెమెరా ఫీచర్లు అందించే స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Best Camera Phones
- రూ. 50వేల లోపు ధరలో 5 బెస్ట్ ట్రిపుల్ కెమెరా ఫోన్లు
- వివో నుంచి నథింగ్ ఫోన్ 4ఎ ప్రో వరకు కిర్రాక్ ఫీచర్లు
- 0MP సెల్ఫీ కెమెరా, 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే
Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి కెమెరా ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. రూ. 50వేల బడ్జెట్లో అద్భుతమైన కెమెరాతో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ట్రిపుల్-కెమెరా ఫోన్ కొనాలని అనుకుంటే ఇది మీకోసమే. వైడ్-యాంగిల్ షాట్ల కోసం బెస్ట్ ట్రిపుల్ కెమెరాలతో 5 అదిరిపోయే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
వివో V40 ప్రో (రూ. 49,999) :
వివో వి40 ప్రోలో ట్రిపుల్ 50MP + 50MP + 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ యూనిట్ ఫన్‌టచ్ 14పై రన్ అవుతుంది. ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది.
ఒప్పో రెనో 15 (రూ. 45,999) :
ఒప్పో రెనో 15లో 50MP + 50MP + 8MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ యూనిట్, కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది. 6500mAh బ్యాటరీతో వస్తుంది.
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ (రూ. 49,999) :
వన్‌ప్లస్ 15ఆర్ 5జీలో 50MP వైడ్, 8ఎంపీ అల్ట్రావైడ్ 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఇందులో బిలియన్ కలర్ ఆప్షన్లతో 6.83 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ 7400mAh బ్యాటరీ ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 5జీ (రూ. 39,999) :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 5జీలో 50MP + 8MP + 12MP రియర్ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎక్సినోస్ 2400e ప్రాసెసర్, వన్ యూఐ 8.0పై రన్ అవుతుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే 4700mAh బ్యాటరీతో వస్తుంది.
నథింగ్ ఫోన్ 4ఎ ప్రో (రూ. 42,999) :
నథింగ్ ఫోన్ 4ఎ ప్రోలో OIS, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP + 50MP + 8MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ యూనిట్, నథింగ్ OS 4.1పై రన్ అవుతుంది. 5080mAh బ్యాటరీతో వస్తుంది. బిలియన్ కలర్ 144Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది.
