EPFO Members Alert : UAN యాక్టివేషన్ మాత్రమే కాదు.. UMANGలో ఈ 4 పనులు కూడా చేయొచ్చు!
EPFO Members Alert : ఈపీఎఫ్ఓ సభ్యులు UMANG యాప్ ద్వారా తమ UANను యాక్టివేట్ చేసుకోవచ్చు. KYC, EPF పాస్‌బుక్ డౌన్‌లోడ్, క్లెయిమ్ స్టేటస్, EPF బ్యాలెన్స్ చెకింగ్ వంటి అన్ని పనులను చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- September 5, 2026 / 09:35 PM IST
EPFO Members Alert
- పీఎఫ్ UAN యాక్టివేషన్ ప్రాసెస్ ఇదిగో
- UMANG యాప్ ద్వారా చాలా సింపుల్
- ఈ 4 పనులను ఇంటి వద్దనే చేయొచ్చు
EPFO Members Alert : పీఎఫ్ ఖాతాదారులు తప్పక తెలుసుకోండి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఉమాంగ్ యాప్ ద్వారా అన్ని పనులను పూర్తి చేయొచ్చు. ఇందులో అత్యంత ముఖ్యమైనది యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియ.
ఇప్పుడు కేవలం ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ యాప్ ద్వారా అనేక పనులను పూర్తి చేయొచ్చు. డిజిటిలైజేషన్ లో భాగంగా ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు అనేక ఆన్‌లైన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఉమాంగ్ యాప్ ద్వారా ఏయే పనులను పూర్తి చేయొచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..
1. UAN యాక్టివేషన్ ప్రాసెస్ :
ఉద్యోగులు ఇప్పుడు తమ కంపెనీ ఎంప్లాయిర్ సాయం లేకుండానే తమ UANను ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. కేవలం మీ ఫోన్‌లో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉద్యోగులు తమ ఫస్ట్ జాబ్ చేరినప్పుడు యూఎఎన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం..
- మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో ఉమాంగ్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి
- సెర్చ్ బార్‌లో ఈపీఎఫ్ఓ ఎంచుకోవాలి.
- UAN ఎంప్లాయ్‌మెంట్ అండ్ యాక్షన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ డేటాను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- మీ వ్యక్తిగత డేటా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఆ తర్వాత మీరు సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- మీ UAN నంబర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- యాక్టివేషన్ అయినట్టుగా కనిపిస్తుంది.
2. కేవైసీ ప్రాసెస్ :
ఈపీఎఫ్ఓ సభ్యులు ఉమాంగ్ యాప్ ద్వారా కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, కొత్త కేవైసీ రిజిస్ట్రేషన్‌ల కోసం అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్‌ను విజిట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎంప్లాయర్ అనుమతి అవసరం కావచ్చు. మరికొన్నింటిలో అనుమతి లేకుండానే కేవైసీని పూర్తి చేయవచ్చు.
Read Also : Canara Bank ATM Rules : ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. ఈ బ్యాంకు ATMలో లిమిట్ దాటితే ఛార్జీల మోతే!
3. పాస్‌బుక్ చెక్ చేయడం :
మీ ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది? ఎంత వడ్డీ జమ అయిందో తెలుసుకునేందుకు మీరు ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ ఖాతా పాస్‌బుక్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.
4. క్లెయిమ్ స్టేటస్ :
మీరు ఉమాంగ్ యాప్ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా, సభ్యులు ఇంటి నుంచి అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా PF క్లెయిమ్‌లను త్వరగా ప్రాసెస్ చేసుకోవచ్చు.
