EPFO Portal Shutdown : పీఎఫ్ విత్‌డ్రా ఈ తేదీల్లో అసలు చేయొద్దు.. ఏకంగా 3 రోజులు సేవలు బంద్.. క్లెయిమ్స్ చేస్తే జరిగేది ఇదే..!

EPFO Portal Shutdown : ఈ వారం మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేశారా? లేదా క్లెయిమ్ దాఖలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు చేయకపోవడమే బెటర్.. ఎందుకంటే?

EPFO Portal Shutdown

EPFO Portal Shutdown : పీఎఫ్ డబ్బులు తీసుకోవాలని చూస్తున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. ఈ వారంలో పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేయకపోవడమే బెటర్.. మరికొన్ని రోజులు వెయిట్ చేస్తేనే మంచిది. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలన్నా లేదా పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవాలన్నా ఈ మూడు రోజులు మాత్రం చేయలేరు.. ఎందుకంటే.. ఈ తేదీల్లో పీఎఫ్ పోర్టల్ పూర్తిగా షట్ డౌన్ కానుంది.

మెయిన్ సిస్టమ్ అప్ గ్రేడ్ కారణంగా జూన్ 26 నుంచి జూన్ 28 వరకు మెంబర్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది. సర్వీసు క్వాలిటీని మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తులో క్లెయిమ్ ప్రాసెసింగ్‌ మరింత వేగవంతంగా ఉండేందుకు అప్ గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపింది.

ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్ ప్రకారం.. క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ కోసం డేటాబేస్, సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేయనుంది. ప్రాసెసింగ్ స్పీడ్ పెంచడం, సిస్టమ్ పర్ఫార్మెన్స్ మెరుగుపర్చేందుకు ఈ అప్ గ్రేడ్ అవసరమని ఈపీఎఫ్ఓ పేర్కొంది. పోర్టల్ సిస్టమ్ మైగ్రేషన్ సమయంలో కొన్ని కీలకమైన సర్వీసులు అందుబాటులో ఉండవు.

Read Also : Tungabhadra Dam : రైతుల కోసం ముగ్గురు సీఎంలు ఏకమై.. తుంగభద్రకు మళ్లీ వైభవం!

ఏయే సేవలు బంద్ :
జూన్ 26, 2026న అర్ధరాత్రి 12:00 గంటలకు ప్రారంభమై జూన్ 28, 2026న రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. జూన్ 29, 2026న అర్ధరాత్రి (12 గంటల నుంచి అన్ని సేవలు రీస్టోర్ అవుతాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. అంటే మూడు రోజుల పాటు సేవలు అందుబాటులో ఉండవు.

ఈ సమయంలో పీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా కొత్త క్లెయిమ్ అప్లయ్ చేయలేరు. క్లెయిమ్ ప్రాసెసింగ్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఫలితంగా పోర్టల్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయలేరు. క్లెయిమ్ సంబంధిత సేవల కోసం అప్లయ్ చేసే వారు సిస్టమ్ పూర్తి అప్ గ్రేడ్ అయ్యేవరకు ఆగడమే బెటర్.

మైగ్రేషన్ సమయంలో అప్పటికే ప్రాసెస్ మొదలైన క్లెయిమ్స్ క్యాన్సిల్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అప్ గ్రేడ్ పూర్తయ్యాక ఈ పెండింగ్ క్లెయిమ్స్ పరిశీలిస్తామని తెలిపింది. ఈ సమయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే పీఎఫ్ సభ్యులు 14470 నంబరులో ఈపీఎఫ్ఓ ​​కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.