New PF Rules : చేతికి వచ్చే జీతం తగ్గిందా? సెప్టెంబర్ శాలరీ చూసి షాకయ్యారా? ఇకపై PF కటింగ్ ఇంతే..!

New PF Rules : సెప్టెంబర్ జీతంలో పీఎఫ్ ఎక్కువ కట్ అయిందని బాధపడుతున్నారా? EPFO వేతన పరిమితి ఎంత పెరిగింది? నెలకు పీఎఫ్‌ కటింగ్ ఎంత ఉంటుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

New PF Rules

  • మీ జీతం పడిందా? పీఎఫ్ కటింగ్ ఎందుకు పెరిగిందంటే?
  • నెలకు రూ.1,200 అదనంగా PFలోకి.. ఎవరికి వర్తిస్తుందంటే?
  • పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలు.. మీ జీతంలో ఎంత తేడా వస్తుంది?

New PF Rules : సెప్టెంబర్ జీతం పడింది. కానీ, చేతికి వచ్చిన మొత్తం గత నెల కన్నా తక్కువగా ఉందా? పేస్లిప్ చూస్తే పీఎఫ్ కట్ పెరిగినట్లు కనిపిస్తోందా? కంగారు పడకండి. దీనికి కారణం.. కొత్త PF రూల్. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. ఈ నిబంధన అమల్లోకి రావడంతో సెప్టెంబర్ జీతాల్లో ఒక్కసారిగా పీఎఫ్ కటింగ్ ఎక్కువగా కనిపిస్తోంది.

నెలకు ఎంత కట్ అవుతుంది? :
ఇప్పటివరకు పీఎఫ్ లెక్కింపునకు గరిష్ఠ వేతన పరిమితి రూ.15,000. ఉద్యోగి వాటా 12 శాతం. అంటే.. గరిష్ఠంగా నెలకు రూ.1,800 కట్ అయ్యేది. ఇప్పుడు పరిమితి రూ.25,000కు పెరిగింది. రూ.25వేలపై 12 శాతం లెక్కిస్తే ఉద్యోగి వాటా రూ.3వేలు అవుతుంది. అంటే.. పాత లెక్కతో పోలిస్తే నెలకు రూ.1,200 ఎక్కువ పీఎఫ్‌లోకి వెళ్తుంది. దీంతో చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. ఏడాదికి చూస్తే ఈ అదనపు కాంట్రిబ్యూషన్ రూ.14,400 అవుతుంది.

ఎవరిపై ప్రభావం? :
కొత్త పరిమితి రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య వేతనం ఉన్న ఉద్యోగులకు వరిస్తుంది. ఇంతకుముందు రూ.15వేలు సీలింగ్ వల్ల పీఎఫ్ లెక్కింపు అక్కడే ఆగిపోయేది. ఇప్పుడు ఎక్కువ వేతనాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

Read Also : EPFO New Rules : EPFOలో భారీ మార్పు.. ఇక PF ఖాతాలో నెలకు రూ.3వేలు? ఫుల్ డిటెయిల్స్!

ముఖ్యంగా రూ.25వేలు లేదా అంతకంటే ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్నవారికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వారి పీఎఫ్ లెక్కింపు రూ.25వేల వరకు జరిగితేనే ఉద్యోగి వాటా రూ.3వేలు అవుతుంది. అంటే.. ఈ లెక్క పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.25వేలు సీలింగ్‌పై అమలయ్యే ఉద్యోగులకే వర్తిస్తుంది.

EPSలోనూ భారీ మార్పు :
ఈ మార్పు ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ పరిమితం కాదు. ఎంప్లాయిర్ EPS (పెన్షన్) కాంట్రిబ్యూషన్ లెక్కింపులోనూ తేడా వస్తుంది. ఈపీఎస్‌కు 8.33 శాతం లెక్కిస్తారు. రూ.15,000పై గరిష్ఠంగా సుమారు రూ.1,250 ఉంటుంది. ఇప్పుడు రూ.25వేలపై లెక్కిస్తే సుమారు రూ.2,083 అవుతుంది. అంటే పెన్షన్ ఖాతాకు వెళ్లే మొత్తం కూడా పెరుగుతుంది.

డబ్బు పోయినట్లు కాదు :
అదనంగా జీతం కట్ అయిన ఆ మొత్తం మీ పీఎఫ్ ఖాతాలోనే జమ అవుతుంది. దానికి కంపెనీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా కలుస్తుంది. వర్తించే ఈపీఎష్ కాంట్రిబ్యూషన్ కూడా కలుస్తుంది. అంటే భవిష్యత్ రిటైర్మెంట్ సేవింగ్స్ పెరుగుతాయి.

చేతికి వచ్చే జీతం తగ్గినా, ఇది మీ డబ్బే. అందుకే ఆందోళన అక్కర్లేదు.. ఒక పని మాత్రం చేయండి. ఈ నెల పేస్లిప్‌లో పీఎఫ్ డెడెక్షన్, ఎంప్లాయిర్ కాంట్రిబ్యూషన్, ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ వివరాలు ఓసారి చెక్ చేసుకోండి.. కొత్త రూల్ వల్ల మీ జీతంలో ఎంత తేడా వచ్చిందో మీకే తెలుస్తుంది.