EPFO Scheme 2026 : మీ పీఎఫ్‌లో ఎక్కువ కట్ అవ్వాలా? చేతికి ఎక్కువ జీతం కావాలా? ఏ PF ఆప్షన్ ఎంచుకోవాలి? ఫుల్ డిటెయిల్స్
EPFO Scheme 2026 : కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. పాత ఈపీఎఫ్ స్కీమ్ 1952 స్థానంలో అమల్లోకి తెస్తోంది. ఈ కొత్త విధానంతో ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మరిన్ని పొందవచ్చు.
- Sreehari A
- Published on- July 20, 2026 / 11:58 AM IST
EPFO Scheme 2026
- ఈపీఎఫ్ 2026లో మీ జీతం, వయసు, లక్ష్యాల ఆధారంగా ఆప్షన్ ఎంచుకోండి.
- పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెంచాలా తగ్గించాలా? బెస్ట్ ఛాయిస్ ఇదే
- మీ జీతానికి సరిపోయే పీఎఫ్ ఆప్షన్ ఏది? వయసు బట్టి ఇలా ఎంచుకోండి!
EPFO Scheme 2026 : ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారుల కోసం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. పాత ఈపీఎఫ్ స్కీమ్, 1952 స్థానంలో కొత్త ఈపీఎఫ్ స్కీమ్, 2026ను అమల్లోకి తీసుకువస్తోంది. ఉద్యోగులు పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు భారీగా అందనున్నాయి.
చట్టపరమైన భరోసా కల్పించే దిశగా కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. అయితే, ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ విధానంలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ప్రధానంగా 3 పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటిలో ఏ పీఎఫ్ ఆప్షన్ బెటర్ అనేది ఉద్యోగి వయసు, జీతం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
- బేసిక్ శాలరీలో 12శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్
- బేసిక్ శాలరీలో 9శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్
- నెలకు రూ.1,800 ఫిక్స్‌డ్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్
12శాతం పీఎఫ్ :
రిటైర్మెంట్ కోసం ఎక్కువ సేవింగ్స్ కావాలంటే ఇది ఎంచుకోవచ్చు. లాంగ్ టైమ్ తర్వాత మంచి రిటైర్మెంట్ ఫండ్ కోరుకునేవారికి 12శాతం పీఎఫ్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మధ్య వయసు లేదంటే కెరీర్‌లో బాగా స్థిరపడిన ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా ప్రతి నెలా ఎక్కువ మొత్తం పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
- దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సేవింగ్స్ పెరుగుతాయి
- సేవింగ్ చేయడం అలవాటు అవుతుంది
- మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందుతారు
- రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్
9శాతం పీఎఫ్ :
సేవింగ్స్, ప్రస్తుత అవసరాలకు వాడుకోవచ్చు. హోమ్ లోన్, పిల్లల చదువు ఖర్చులు, ఇతర ఈఎంఐలు ఉన్న ఉద్యోగులకు 9శాతం పీఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్.. ఎలాగంటే?
- పీఎఫ్‌లో సేవింగ్స్ పెంచుకోవచ్చు
- చేతికి వచ్చే జీతం కొంతవరకు పెరుగుతుంది
- ఆర్థికపరమైన అవసరాలకు పనికివస్తుంది
- భవిష్యత్ ఆర్థిక భద్రత ఉంటుంది. ప్రస్తుత అవసరాలు కూడా తీరుతాయి.
రూ.1,800 పీఎఫ్ :
యువ ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఉద్యోగులు, ఎక్కువ క్యాష్ అవసరం ఉన్నవారు ఎవరైనా రూ.1,800 ఫిక్స్‌డ్ పీఎఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తద్వారా ప్రతి నెలా చేతికి అందే జీతం భారీగా పెరుగుతుంది.
ఇంటి అద్దె, జీవన ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఈజీగా వాడుకోవచ్చు. అయితే, పీఎఫ్‌లో మిగిలే మొత్తం ఇతర పెట్టుబడుల్లో రెగ్యులర్ గా పెడుతుంటే భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చు. ఉదాహరణకు.. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర దీర్ఘకాల పెట్టుబడుల కోసం వాడుకోవచ్చు.
ఏ పీఎఫ్ ఆప్షన్ బెటర్? :
- రిటైర్మెంట్ కోసం ఎక్కువ సేవింగ్స్ కావాలంటే 12శాతం పీఎఫ్
- లోన్లు, కుటుంబ బాధ్యతల మధ్య వయస్సు, ఉద్యోగులకు 9శాతం పీఎఫ్
- కెరీర్ ప్రారంభంలో యువ ఉద్యోగులు, ఎక్కువ టేక్ హోం శాలరీ కావాలనుకుంటే రూ.1,800 పీఎఫ్
అయితే, అందరికీ ఒకే పీఎఫ్ ఆప్షన్ సరికాదు.. మీ వయస్సు, నెల జీతం ఎంత వస్తుంది? కుటుంబ బాధ్యతలు, భవిష్యత్ లక్ష్యాలను బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి. లాంగ్ టైమ్ సంపాదన కోసం 12శాతం పీఎఫ్ ఎంచుకోవడం బెటర్. అలాగే, ఆదాయం-పొదుపు కోసం 9శాతం పీఎఫ్, ఎక్కువ లిక్విడిటీ కోసం రూ.1,800 పీఎఫ్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.
