కేంద్రానికి వచ్చే ఆదాయమెంత? రాష్ట్రాలకు ఇచ్చేదెంత?

పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తం ఎంత? రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా విలువ ఎంత? ఏ

  • Publish Date - February 1, 2019 / 03:55 PM IST

పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తం ఎంత? రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా విలువ ఎంత? ఏ

ఢిల్లీ: పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? సంక్షేమ పథకాలకు కేంద్రం కేటాయించే మొత్తం ఎంత? రాబడిలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా విలువ ఎంత? ఏ పథకానికి ఎంత కేటాయిస్తారు. ఏ రంగానికి ఎంత మొత్తం ఇస్తారు. అసలు కేంద్రం చెప్పే దాంట్లో వాస్తవం ఏంటి? ఈ వివరాల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. అన్ని పథకాలకు మేమే డబ్బు ఇస్తామని కేంద్రం గొప్పలు చెబుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే… రాష్ట్రాల నుంచే అనే సమాధానం వస్తుంది. రాబడిలో సింహ భాగం రాష్ట్రాల ద్వారానే కేంద్రానికి వెళుతుంది.

 

కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రతి రూపాయిలో 70 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే వస్తుంది. అందులో 23 పైసలు మాత్రమే రాష్ట్రాలకు కేటాయిస్తుంది. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయ, వ్యయ వివరాలను కేంద్ర తాత్కాలిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

 

* యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చేది 7పైసలు
* కార్పొరేషన్ ట్యాక్ 21 పైసలు
* నాన్ డెబ్ట్ కేపిటల్ రిసిప్ట్స్ ద్వారా 3 పైసలు
* కస్టమ్ ద్వారా వచ్చే ఆదాయం 4 పైసలు
* రాష్ట్రాల పన్నులు, డ్యూటీల ద్వారా వచ్చేది 23 పైసలు
* రక్షణ శాఖకు కేటాయించే నిధుల సంఖ్య 8 పైసలకు తగ్గింపు
* సెంట్రల్ సెక్టార్ స్కీమ్ పై 12 పైసలు
* సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ పై 9 పైసలు
* ఫైన్సాన్స్ కమిషన్‌కు అయ్యే వ్యయం 8 పైసలు
* సబ్సిడీల కోసం 9 పైసలు, పెన్షన్ల కోసం 5 పైసలు
* ఇతర వ్యయాలపై 8పైసలు

ట్రెండింగ్ వార్తలు