Best Family Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 8 లక్షల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు… ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్!
Best Family Cars : ఫ్యామిలీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త 7 సీటర్ కారు కొనేందుకు చూస్తున్నారా? కేవలం రూ. 8 లక్షల లోపు ధరలో హై మైలేజీ అందించే బెస్ట్ 7 సీటర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ కారులో కావాలో కొనేసుకోండి.
- Sreehari A
- Published On : April 5, 2026 / 06:02 PM IST
Best Family Cars
- ఫ్యామిలీ కస్టమర్ల కోసం అద్భుతమైన 7 సీటర్ కార్లు
- తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే ఫ్యామిలీ కార్లు ఇవే
- రూ. 8 లక్షల లోపు ధరలో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోండి
Best Family Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? దేశీయ మార్కెట్లో పెద్ద ఫ్యామిలీల కోసం సరసమైన ధరలో 7 సీటర్ కార్లు లభిస్తున్నాయి. 2026లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రూ. 8 లక్షల కన్నా తక్కువ ధరకే ఈ కార్లను అందిస్తోంది. అధిక మైలేజీ అందించే 7 సీటర్ కార్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. అద్భుతమైన ఫీచర్లు, అధిక మైలేజీని అందించే అనేక సరసమైన 7-సీటర్ కార్లు, ఎంపీవీలు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో మీ ఫ్యామిలీ కోసం మంచి కారును కొనేసుకోవచ్చు. ఇందులో నిస్సాన్ గ్రావిట్, రెనాల్ట్ ట్రైబర్, మహీంద్రా బొలెరో వంటి పవర్‌ఫుల్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు, ఆకట్టుకునే ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
నిస్సాన్ గ్రావిటే :
మీ బడ్జెట్‌లో మోడ్రాన్, స్టైలిష్ 7-సీటర్ కారు కోసం చూస్తున్న యూజర్లకు బెస్ట్ ఆప్షన్. నిస్సాన్ మోటార్ ఇండియా పాపులర్ నిస్సాన్ గ్రావైట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన MPVగా లభిస్తోంది.
మీరు కేవలం రూ. 5.65 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. 999cc పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. సుమారుగా 71bhp పవర్, 96Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. నగర ట్రాఫిక్‌లో నడపడం చాలా సులభం. లీటరుకు 19.6 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. దూర ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది.
మారుతి సుజుకి ఈకో :
మారుతి సుజుకి ఈకో భారత మార్కెట్లో మల్టీఫేస్ వ్యాన్. ప్యాసెంజర్ లేదా సరుకుల కోసం వాడుకోవచ్చు. దశాబ్దాలుగా దేశీయ రోడ్లపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రూ. 5.47 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఈ 7-సీటర్ కారు బిజినెస్, ఫ్యామిలీలకు అద్భుతమైన ఆప్షన్.
పవర్‌ఫుల్ 1197cc పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. లీటరుకు సుమారు 19.71 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. తక్కువ మెయింట్ నెన్స్ ఖర్చు ఉంటుంది. మిడిల్ క్లాసు ఫ్యామిలీలకు సరైన కారు.
మహీంద్రా బొలెరో :
మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కఠినమైన రోడ్లు, రాతి భూభాగాలను ఈజీగా తట్టుకోగలదు. 7-సీటర్ కోసం చూసేవారికి రూ. 7.99 లక్షల ధరలో బొలెరో బెస్ట్ ఆప్షన్.
ఇందులో పవర్‌ఫుల్ 1493cc డీజిల్ ఇంజన్ ఉంది. సుమారుగా 74.96bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ వెయిట్ ఉండే ఈ బొలెరో మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. క్లాసిక్ డిజైన్, మెటల్ బాడీ నిర్మాణంతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
రెనాల్ట్ ట్రైబర్ :
తక్కువ ధరకే యూరోపియన్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు, సేఫ్టీ కోరుకునే ఫ్యామిలీలకు రెనాల్ట్ ఇండియా ఎంపీవీ ట్రైబర్ అద్భుతమైన కారు. ఈ మోడల్ ధరలు కేవలం రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఈ కారులో స్పెషాలిటీ డిటాచబుల్ సీట్లు ఉన్నాయి. బూట్ స్పేస్ భారీగా పెంచుకోవచ్చు.
ట్రైబర్‌లో 999cc పెట్రోల్ ఇంజన్ ఉంది. గరిష్టంగా 71Bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. హైవేపై సుమారుగా 20 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది. మాడ్యులర్ క్యాబిన్, గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులలో మంచి రేటింగ్ పొందింది. సేఫ్టీ, స్టైల్ పరంగా బెస్ట్ ఆప్షన్.
