FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి బాదుడే.. ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజు భారీగా పెంపు.. ఎంతంటే?!

FASTag Annual Pass : టోల్ పాస్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వార్షిక టోల్ పాస్ ఫీజు పెంచనున్నట్టు NHAI ప్రకటించింది. ఎంత పెరగనుందో తెలుసా?

FASTag Annual Pass

  • ఏప్రిల్ 1 నుంచి వార్షిక టోల్ ఫీజు పెంపు అమల్లోకి
  • ప్రస్తుత టోల్ పాస్ ఫీజు ధర రూ. 3వేలు
  • వాహనాదారులు అదనంగా రూ. 75 చెల్లించాలి
  • మార్చి 31లోగా రీఛార్జ్ చేస్తే పాత టోల్ పాస్ ఛార్జీలు

FASTag Annual Pass : నేషనల్ హైవేలపై వెళ్లే వాహనదారులకు బిగ్ షాక్.. ప్రైవేట్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ధర భారీగా పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి 2.5శాతం టోల్ పాస్ ధర పెరగనుంది. ప్రస్తుతం, టోల్ వార్షిక పాస్ ధర రూ.3,000 ఉండగా వచ్చే నెల నుంచి మరో రూ. 75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 31వరకు పాత టోల్ పాస్ ఛార్జీలు :
దాంతో టోల్ పాస్ ధర రూ.3,075 అవుతుంది. మార్చి 31లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత టోల్ పాస్ ధరలే వర్తిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రూ.3వేలకే వార్షిక టోల్ పాస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత రీఛార్జ్ చేస్తే మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ టోల్ పాస్ ఉంటే టోల్ ప్లాజా వద్ద కార్లు ఆపకుండా వెళ్లొచ్చు. మొత్తంగా ఏడాదిలో 200 టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఈ వార్షిక పాస్‌ను సంవత్సరంలో అనేకసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి 52 లక్షలకుపైగా హైవే కారు యూజర్లు వార్షిక పాస్‌కు సభ్యత్వాన్ని పొందారు.

Read Also : Book LPG Cylinder : గ్యాస్ అయిపోయిందా? ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే సిలిండర్.. సింపుల్ బుకింగ్ ఆప్షన్లు.. ఫాస్ట్ డెలివరీ!

ప్రైవేట్ వాహనాలకు మాత్రమే :
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. గతంలో టోల్ పాస్ కోసం రూ. 3000 చెల్లించేవారు. ఇకపై వాహనాదారులు రూ. 75 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రేట్లు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ప్రైవేట్ వాహనాలకు మాత్రమే టోల్ పాస్ అందుబాటులో ఉంటుంది. మీ వాహనంలో ‘యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్’ తప్పనిసరిగా ఉండాలి.

టోల్ క్రాసింగ్ లిమిట్ 200 వార్షిక పాస్ ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. గరిష్టంగా 200 టోల్ వాడుకోవచ్చు. 200 సార్లు టోల్‌ దాటాక టోల్ వ్యాలిడిటీ ఏడాదికి ముందే ముగిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.

ఈ కొత్త ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే NHAI అన్ని టోల్ ప్లాజాలు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టోల్ రేట్లను ప్రతి ఏడాదిలో రివ్యూ చేసి సవరిస్తారు. ఈ ఏడాది కూడా వార్షిక పాస్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి.

పేమెంట్ విధానం ఇలా? :
ఆన్‌లైన్ ద్వారా ఈజీగా వార్షిక పాస్ పొందవచ్చు. రాజ్‌మార్గ్ యాత్ర యాప్, NHAI అధికారిక పోర్టల్‌ విజిట్ చేసి మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఫాస్టాగ్ వివరాలతో లాగిన్ అవ్వండి. కొత్త ధర రూ. 3,075 యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలి. 24 గంటల్లో మీ టోల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.