FASTag Annual Pass : వాహనాదారులకు బిగ్ బ్రేకింగ్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు.. రెన్యువల్‌కు ఇంకా 4 రోజులే..!
FASTag Annual Pass : వాహనాదారులకు షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెరగనుంది. పాస్ రెన్యువల్ అయ్యేందుకు ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : March 28, 2026 / 08:00 PM IST
FASTag Annual Pass
- ఏప్రిల్ నుంచి ఫాస్టాగ్ వార్షిక ఫీజు ధర పెంపు అమల్లోకి
- ప్రస్తుత ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000
- మరో 4 రోజుల్లో ఫాస్టాగ్ వార్షిక ఫీజు ధర రూ. 75 పెంపు
- ఏడాదిలో 200 ప్రయాణాలు పూర్తయ్యే వరకు వ్యాలిడిటీ
FASTag Annual Pass : హైవేలపై వెళ్లే వాహనాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర భారీగా పెరగనుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం ఫాస్టాగ్ సంబంధించి కొన్ని కీలక మార్పులు జరుగనున్నాయి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలలో మార్పును వెల్లడించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ధర అమల్లోకి వస్తుంది. ఈ మార్పునకు కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. జాతీయ రహదారులపై తరచుగా వెళ్లే వారు రాబోయే కొత్త మార్పులపై అవగాహన ఉండటం బెటర్. ఫాస్టాగ్ వార్షిక పాస్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫాస్టాగ్ వార్షిక పాస్ కొత్త ధర ఎంత? :
ప్రస్తుత ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000 కాగా, కేవలం 4 రోజుల్లోనే అది రూ. 3,075కు పెరగనుంది. అంటే.. వాహనాదారులు అదనంగా రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ వార్షిక పాస్‌ను రాజ్‌మార్గ యాత్ర యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని NHAI సిఫార్సు చేస్తోంది.
కార్డుతో చేసే వన్ టైమ్ పేమెంట్లు ఏడాది పాటు లేదా 200 ప్రయాణాలు పూర్తయ్యే వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒక వాహనాదారుడు ఒక సంవత్సరంలోపు 200 ప్రయాణాలు పూర్తి చేసినా చేయకపోయినా వ్యాలిడిటీ ముగిసిపోతుంది. ఒకవేళ వినియోగదారుడు సంవత్సరం ముగియక ముందే 200 ప్రయాణాలు పూర్తి చేసినా కూడా వ్యాలిడిటీ ముగుస్తుంది.
Read Also : Credit Card Tips : విదేశాలలో మీ క్రెడిట్ కార్డు గీకితే మటాషే.. కార్డు స్వైప్ చేసే ముందు తప్పక తెలుసుకోండి!
ఫాస్టాగ్ ఏంటి, ఎందుకు ముఖ్యం? :
ఫాస్టాగ్ అనేది RFID టెక్నాలజీతో పనిచేసే ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ. డ్రైవర్లు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వెళ్లొచ్చు. అలాగే టోల్ మొత్తం లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లేదా వాలెట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దేశవ్యాప్తంగా టోల్ వసూలు కోసం ఫాస్టాగ్ అందుబాటులో ఉంది. తద్వారా టైమ్ సేవ్ చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుంది.
వార్షిక పాస్ ఎందుకు బెస్ట్? :
ప్రతిరోజూ హైవేలపై ప్రయాణించే వారికి ఫాస్టాగ్ వార్షిక పాస్ స్పెషల్ బెనిఫిట్. ఒకసారి కొనుగోలు చేస్తే ప్రతిసారీ విడిగా టోల్ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. జర్నీ ఈజీ కావడంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయి.
టోల్ ఫీ పెంపు ప్రభావం ఎలా? :
చాలా మంది వాహనదారులకు రూ. 75 పెంపు కూడా ఎక్కువే. భవిష్యత్తులో టోల్, సంబంధిత సేవల ధరలు ఇంకా పెరగొచ్చు. టైమ్ సేవ్ కోసం చూస్తే ఈ పాస్ బడ్జెట్‌కు అద్భుతైమన ఆప్షన్. టోల్ సిస్టమ్ పూర్తిగా డిజిటల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, NHAI ప్రయత్నాలు చేపట్టాయి.
ఏప్రిల్ 1, 2026 నాటికి నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద క్యాష్ పేమెంట్లను దశలవారీగా తొలగించనుంది. ఇకపై అన్ని టోల్ పేమెంట్లను FASTag, UPI ద్వారా మాత్రమే చేసే అవకాశం ఉంది. ఈ మార్పుతో ట్రాఫిక్ జామ్ తగ్గడమే కాదు.. టోల్ లేన్ స్పీడ్ పెరిగి పేమెంట్ ప్రాసెస్ కూడా స్పీడ్ అవుతుంది.
