×
Ad

FD Highest Interest Rates : గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? అత్యధిక వడ్డీని అందించే టాప్ 10 బ్యాంకులివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!

FD Highest Interest Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి గుడ్ న్యూస్.. ఈ 10 బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఏడాదిలో అత్యధిక వడ్డీని సంపాదించుకోవచ్చు.

FD Highest Interest Rates

FD Highest Interest Rates : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఏడాది వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజట్లను అత్యధిక వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే 10 ప్రధాన బ్యాంకులు ఇలా ఉన్నాయి.

అందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ వంటి (FD Highest Interest Rates) బ్యాంకులు ఉన్నాయి. ఏయే బ్యాంకులు ఎఫ్‌డీ అకౌంట్లపై ఎంత మొత్తంలోవడ్డీని అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండస్ఇండ్ బ్యాంక్ :
ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ఏడాది ఎఫ్‌‌డీపై 7శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీరు రూ. లక్ష పెట్టుబడి పెడితే ఏడాది చివరి నాటికి రూ. 1,07,000కి పెరుగుతుంది.

యాక్సిస్ బ్యాంక్ :
యాక్సిస్ బ్యాంక్ ఒక ఏడాది ఎఫ్‌డీపై 6.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. లక్ష పెట్టుబడి రూ. 1,06,600కు పెరుగుతుంది.

HDFC బ్యాంక్ :
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఒక ఏడాది FDలపై 6.6శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. లక్ష పెట్టుబడిపై రూ. 1,06,600కు పెరుగుతుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ :
ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా 6.6శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరాంతానికి రూ. 1 లక్ష ఎఫ్‌డీ రూ. 1,06,600కు పెరుగుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ :
ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఏడాది ఎఫ్‌డీలపై 6.4 శాతం వడ్డీని అందిస్తుంది. రూ. లక్ష పెట్టుబడితో రూ. 1,06,400 ఆదాయం లభిస్తుంది.

Read Also : Nothing Phone 3a : ఇది కదా ఆఫర్ అంటే.. నథింగ్ ఫోన్ 3aపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

బ్యాంక్ ఆఫ్ బరోడా :
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగ బ్యాంకు. ఒక ఏడాది ఎఫ్‌డీలపై 6.6శాతం వడ్డీని అందిస్తుంది. రూ. 1 లక్ష పెట్టుబడితో రూ. 1,06,600కి పెరుగుతుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ :
పీఎన్‌బీ ఒక ఏడాది FDలపై 6.6శాతం వడ్డీని కూడా అందిస్తుంది. రూ. లక్ష పెట్టుబడి ఏడాది చివరి నాటికి రూ. 1,06,600 వరకు పెరుగుతుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
యూనియన్ బ్యాంక్ ఒక ఏడాది ఎఫ్‌డీపై 6.5శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. లక్ష పెట్టుబడిపై రూ. 1,06,500కు పెరుగుతుంది.

కెనరా బ్యాంకు :
కెనరా బ్యాంక్ కూడా 6.5శాతం వడ్డీ రేటును అందిస్తుంది. లక్ష రూపాయల ఎఫ్‌డీ సంవత్సరం చివరి నాటికి రూ. 1,06,500కు పెరుగుతుంది. ఈ బ్యాంకు దీర్ఘకాలికంగా సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్ అందిస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఒక ఏడాది కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.45శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరాంతానికి రూ. లక్ష పెట్టుబడి రూ. 1,06,450కి పెరుగుతుంది.