New Bike Guide : కొత్త బైక్ కొన్నారా? ఫస్ట్ 1000 కి.మీ లోపు ఈ తప్పు చేస్తే.. ఇంజిన్ గేమ్ ఓవర్!

New Bike Guide : కొత్త బైక్ కొన్నాక ఫస్ట్ 1000 కిలోమీటర్లు నడవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో చేసే చిన్న పొరపాట్లతో బైక్ ఇంజిన్‌, మైలేజీని రెండింటినీ దెబ్బతీస్తాయి. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.

New Bike Guide ( Image Credit : Gemini AI )

  • కొత్త బైక్ కొన్నవారు ఇది తప్పక తెలుసుకోండి
  • ఫస్ట్ 1000 కిలోమీటర్ల వరకు ఇలా అసలు చేయొద్దు
  • ఇలా చేస్తే మీ బైక్ ఇంజిన్ తొందరగా పాడైపోతుంది

New Bike Guide : కొత్త బైక్ కొంటున్నారా? లేదా కొన్నారా? అయితే ఇది మీకోసమే.. బైక్ కొన్న కొత్తలో చాలామంది ఫుల్ స్పీడ్‌తో నడుపుతుంటారు. ఇలా అసలు చేయొద్దు. అందరూ చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఫస్ట్ బైక్ కొన్నాక మొదటి 1000 కిలోమీటర్ల రన్నింగ్ పీరియడ్‌గా పరిగణిస్తారు.

ఈ సమయంలోనే ఇంజిన్ భాగాలు సరిగ్గా సెట్ అవుతాయి. బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఈ సమయంలో బైక్‌ను సరిగ్గా నడపకపోతే భవిష్యత్తులో ఇంజిన్ సౌండ్, తక్కువ మైలేజ్, పర్ఫార్మెన్స్ తగ్గడం వంటి అనేక సమస్యలు తలెత్తవచ్చు.

చాలా మంది హైస్పీడ్ బైక్ నడపడం, సడన్ బ్రేకులు వేయడం, కొత్త బైక్‌లపై అధిక బరువు వేయడం చేస్తుంటారు. ఇవి నేరుగా ఇంజిన్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే కొత్త బైక్‌ కొన్న తర్వాత ఫస్ట్ సర్వీసు చేయించేంత వరకు కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా అవసరం.

హైస్పీడ్‌తో బైక్ ఎక్కువసేపు నడపొద్దు :
కొత్త బైక్ కొన్న మొదట్లో మరీ వేగంగా నడపొద్దు. ఫస్ట్ 1,000 కిలోమీటర్ల వరకు మీ స్పీడ్ లిమిట్‌గానే ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతిసారి హై ఆర్బీఎమ్ (RPM) వద్ద నడపడం వల్ల ఇంజిన్‌లోని ఇంటర్నల్ పార్టులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

Read Also : Whatsapp Spam Calls : వాట్సాప్ ఫేక్ కాల్స్‌కు ఇక ఫుల్ స్టాప్! ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు!

అంతేకాదు.. ఎక్కువ సేపు ఆగకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్ తీవ్రంగా వేడెక్కే అవకాశం ఉంది. కొత్త బైక్‌పై వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా స్పీడ్ పెంచడం, గట్టిగా బ్రేకులు వేయడం వంటివి కూడా చేయకూడదు.

ఇలా చేస్తే ఇంజిన్, బ్రేకులు రెండింటిపై ప్రభావం పడుతుంది. బైక్‌ను స్మూత్‌గా నడిపేందుకు ట్రై చేయండి. తరచుగా గేర్లు మార్చండి. ఇంజిన్ మెరుగ్గా సెట్ అయ్యేందుకు సాయపడుతుంది. లాంగ్ టైమ్ బైక్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది.

ఫస్ట సర్వీసును అసలు నిర్లక్ష్యం చేయొద్దు :
చాలా మంది కొత్త బైక్ కొన్న తర్వాత చేసే ఫస్ట్ సర్వీస్‌ను చాలా తేలికగా తీసుకుంటారు. ఇది చాలా ముఖ్యం. 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల మధ్య ఫస్ట్ సర్వీస్ చేయించుకోవాలని కంపెనీ చెబుతుంది.

ఈ సమయంలో ఇంజిన్ ఆయిల్‌ చెక్ చేస్తారు. చిన్నపాటి లోహపు రేణువులను శుభ్రం చేస్తారు. బైక్‌ను క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్‌ను సమయానికి చేయించకపోతే ఇంజిన్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.

అలాగే, క్వాలిటీ లేని ఇంజన్ ఆయిల్‌ వాడొద్దు. ఎప్పుడూ కంపెనీ బ్రాండెడ్ ఆయిల్ మాత్రమే వాడండి. కొత్త బైక్‌ను సరిగ్గా మెయింటైన్ చేస్తే ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా కాలం పాటు ఉంటుంది. ఇంధన సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.