Flipkart Valentine Week Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 12వేలకు పైగా డిస్కౌంట్..

Flipkart Valentine Week Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, పాత ఐఫోన్లపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.

Flipkart Valentine Week Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 12వేలకు పైగా డిస్కౌంట్..

Flipkart announces Valentine's week sale, offering more than

Flipkart Valentine Week Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ స్పెషల్ సేల్‌ను ప్రారంభించింది. మొబైల్ బొనాంజా పేరుతో ఈ సేల్ కొత్త జనరేషన్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రధానంగా ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15తో సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను ఆఫర్ చేస్తోంది.

అయితే, ఈ సేల్ పరిమిత కాలం మాత్రమేనని గమనించాలి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900కి బదులుగా రూ. 63,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు అందరికి అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 లేటెస్ట్ డీల్ :
ఆపిల్ ఐఫోన్ 15పై డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అధికారిక బ్యానర్‌లో ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 63,999 నుంచి కొనుగోలు చేయవచ్చునని వెల్లడించింది. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా నేరుగా రూ.11901 తగ్గింపు పొందవచ్చు. వినియోగదారులు ఐఫోన్ కొనుగోలుపై బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్‌ని ఎంచుకుంటే.. 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ సేల్ తేదీలోగా అందుబాటులో ఉన్న స్టాక్ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Read Also : Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్ బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్‌తో ఈఎంఐ ఆప్షన్‌పై 10 శాతం తగ్గింపు, సిటీ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు, మరిన్నింటిపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

మీ పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఈ ట్రేడ్‌లో రూ. 54,900 వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ట్రేడ్ చేస్తున్న ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ పాత ఐఫోన్ 13పై ట్రేడింగ్ చేస్తుంటే.. అప్పుడు రూ. 26వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ట్రేడ్-ఇన్‌తో గరిష్ట తగ్గింపుతో పొందవచ్చు.

Flipkart announces Valentine's week sale, offering more than

Flipkart Valentine’s week sale

ఐఫోన్ 15 ఎందుకు కొనాలంటే.. ముఖ్యమైన కారణాలివే :

  • డిస్‌ప్లే సైజు 6.1 అంగుళాలు, 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
  • ఐఫోన్ 14 ప్రో సిరీస్‌ డైనమిక్ ఐలాండ్ నాచ్ మినహా డిజైన్ గత ఐఫోన్ మోడల్‌ల మాదిరిగానే ఉంటుంది.
  • ఐఫోన్ 14 12ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో పోలిస్తే.. 48ఎంపీ మెయిన్ సెన్సార్‌ కలిగి ఉంది.
  • తక్కువ కాంతిలోనూ పోర్ట్రెయిట్‌లలో అద్భుతమైన ఫొటోలను అందించగలదు.
  • బ్యాటరీ లైఫ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో రోజంతా వస్తుంది.
  • ప్రాసెసర్ మరో అప్‌గ్రేడ్.. ఎందుకంటే ఐఫోన్ 15 ఎ16 బయోనిక్ చిప్‌పై రన్ అవుతుంది.
  • ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎ15 చిప్ కన్నా వేగవంతమైనది
  • గతంలో ప్రో మోడల్‌లకు మాత్రమే ఎ16 చిప్ రిజర్వ్ అయింది.
  • ఐఫోన్ 15 లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను ఉపయోగిస్తుంది
  • ఛార్జింగ్ పోర్ట్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
  • ఏదైనా ప్రామాణిక యూఎస్‌బీ కేబుల్‌తో ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 16 Series : కొత్త ఆపిల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. భారీ బ్యాటరీలతో ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 4 మోడల్స్..!