Flipkart Big Billion Days 2026 : ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ వచ్చేశాయ్.. ఈ రెండు ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.. డీల్ మిస్ కావొద్దు!
Flipkart Big Billion Days 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చే అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. అంతకన్నా ముందుగానే ఎర్లీ బర్డ్ సేల్ మొదలైంది. ఒప్పో కె14 లైట్, రియల్ మి పీ4ఎస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
- Sreehari A
- Published on- September 24, 2026 / 05:37 PM IST
Flipkart Big Billion Days 2026
- ఫ్లిప్‌కార్ట్ అడ్వాన్స్ సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- అనేక ఫోన్లు తక్కువ ధరలకు లభ్యం కానున్నాయి
- బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం
Flipkart Big Billion Days 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ ప్రారంభ తేదీలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అనేక కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, హోం అప్లియన్సెస్, ఫ్యాషన్ వంటి మరిన్ని ఆఫర్లు ఉన్నాయి.
అయితే, ఈ బ్రాండ్ పూర్తిస్థాయిలో ఆఫర్లు ప్రకటించాల్సి ఉంది. అంతకన్నా ముందే ఎర్లీ బర్డ్ సేల్‌ను కూడా ప్రకటించింది. కొన్ని డివైజ్‌లపై డిస్కౌంట్లను కూడా రివీల్ చేసింది. కొనుగోలుదారులు బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఎర్లీ బర్డ్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్ ద్వారా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఒప్పో K14 లైట్ రూ. 15,999 ధరకు లభిస్తుండగా నోవా 2 ప్రోను రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు. మీరు శాంసంగ్ గెలాక్సీ F07 4జీ కొనేందుకు చూస్తుంటే ప్రస్తుతం రూ. 11,999కే అందుబాటులో ఉంది.
నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ రూ. 18,999కి సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ రూ. 23,999కి లభిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్‌మి P4 5జీ ప్రస్తుతం రూ. 31,999 ధరతో లిస్టు అయింది. రియల్‌మి P4 5జీని కేవలం రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు.
Read Also : Jio vs Airtel vs Vi : డేటా వద్దు.. ఫోన్ కాల్స్, SMS చాలు.. Jio, Airtel, Viలో చౌకైన కొత్త రీఛార్జ్ ఆప్షన్లు!
సేల్ తేదీ వివరాలివే :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎర్లీ బర్డ్ సేల్ ప్రారంభమైంది. మెయిన్ సేల్ అక్టోబర్ 9న మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుల కస్టమర్లు అక్టోబర్ 8 నుంచే అడ్వాన్స్ యాక్సెస్ పొందవచ్చు.
ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కస్టమర్లు ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ గతంలోనే ధృవీకరించింది. సూపర్ మనీతో కూడా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనేవారు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
ఈ ఏడాదిలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25 అత్యంత ఆకర్షణగా నిలవనున్నాయి. దాంతో పాటు, మోటోరోలా, గూగుల్ నథింగ్ వంటి మరిన్ని కంపెనీలకు చెందిన ఇతర ఫోన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
