Flipkart Freedom Sale 2026 : గేమర్లకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసర్ గేమింగ్ ల్యాప్‌టాప్ సగం ధరకే.. ఇలా కొంటే ఇంకా తక్కువ..!

Flipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఏసర్ ఆస్పైర్ 7పై 45 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ RTX 3050 జీపీయూ, 16GB DDR4 ర్యామ్, 512GB SSD ఉన్నాయి. ధర ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

Acer Aspire 7 RTX 3050 Gaming Laptop

  • ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్ 7 ధర రూ. 71,990కి తగ్గింపు
  • RTX 3050 ప్రాసెసర్‌,16GB ర్యామ్ అందిస్తుంది
  • బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు

Flipkart Freedom Sale 2026 : మంచి గేమింగ్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా అనేక కేటగిరీల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏసర్ ఆస్పైర్ 7 A715-79G ల్యాప్‌టాప్ కూడా భారీ తగ్గింపుతో లభిస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD ఎన్విడియా జిఫోర్స్ RTX 3050 గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌తో 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. సాధారణ గేమర్‌లకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ గేమింగ్ ల్యాప్‌టాప్ డీల్ :

ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ ధర రూ.129,990 కాగా, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా రూ.71,990కే కొనుగోలు (Flipkart Freedom Sale 2026) చేయవచ్చు. లిస్ట్ ధర, సేల్ ధర మధ్య రూ.58వేలు వ్యత్యాసం ఉంది. అంటే.. సుమారుగా 45 శాతం తగ్గింపు అందిస్తుంది.

సాధారణంగా ఈ సేల్ ధర రూ.90వేల నుంచి రూ.1 లక్ష మధ్య ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో రూ.5,025 వరకు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.3,600 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి.

Read Also : Moto G37 Power Price : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G37 పవర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

మీ పాత ల్యాప్‌టాప్‌ ఎక్స్ఛేంజ్ కోసం రూ.6వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తుంది. అయితే, మీ దగ్గర పాత ల్యాప్ టాప్ ఉంటే వర్కింగ్ కండిషన్, మోడల్ ఫ్లిప్‌కార్ట్ వాల్యుయేషన్‌ ఆధారంగా తగ్గింపు ఉంటుంది.

ఏసర్ ఆస్పైర్ 7 స్పెసిఫికేషన్లు :

ఈ ఏసర్ ఆస్పైర్ 7 వేరియంట్‌లో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్ ఉంది. క్లాక్ స్పీడ్ 4.6GHz వరకు ఉంటుంది. 16GB DDR4 ర్యామ్, 512GB SSD స్టోరేజ్ అందిస్తుంది. గ్రాఫిక్స్ 6GB GDDR6 గ్రాఫిక్స్ మెమరీతో ఎన్విడియా జిఫోర్స్ RTX 3050 జీపీయూ అందిస్తుంది.

ఏసర్ ఆస్పైర్ 7లో 1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 16GB DDR4 ర్యామ్ అందిస్తుంది. తద్వారా ఒకేసారి అనేక యాప్‌లను బ్రౌజర్ ట్యాబ్‌లతో రన్ చేయవచ్చు. స్టోరేజ్ కోసం 512GB SSD కూడా ఉంది. సిస్టమ్ యాప్స్ వేగంగా లోడ్ అవుతాయి.

ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లలో ఎన్విడియా జిఫోర్స్ RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్ ఒకటి. 6GB GDDR6 గ్రాఫిక్స్ మెమరీని అందిస్తుంది. బ్లూటూత్ వై-ఫై 6 కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులో 4 USB పోర్ట్‌లు, ఒక HDMI పోర్ట్ కూడా ఉంది.

ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ బరువు సుమారుగా 1.99 కిలోగ్రాములు. కొలతలు సుమారుగా 36 x 23.8 సెంటీమీటర్లు ఉంటుంది. డివైజ్ మందం సుమారుగా 2.3 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 54Wh సామర్థ్యంతో 4-సెల్ లిథియం-అయాన్ బ్యాటరీతో రన్ అవుతుంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంది. ఇందులో MS ఆఫీస్ కూడా ఉంది.