Flipkart Big Festive Dhamaka Sale
Flipkart Big Festive Dhamaka Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది. అంతలోనే మరో కొత్త సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8 వరకు బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌ను ప్రారంభించింది. దీపావళికి ముందే ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్‌తో సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
వినియోగదారులు వైడ్ రేంజ్ (Flipkart Big Festive Dhamaka Sale) స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు. ముఖ్యంగా, ఈ సేల్ ఈవెంట్ ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ తగ్గింపుతో కొనేందుకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. మీరు కూడా కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు.
ఐఫోన్ 16 సిరీస్‌పై అద్భుతమైన ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16 కేవలం రూ.56,999కే లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో ధర రూ.85,999, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,04,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలన్నింటిపై బ్యాంక్ డిస్కౌంట్లు, మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఆపిల్ లవర్స్‌కు అద్భుతమైన అవకాశం.. ఎందుకంటే ఇంత తక్కువ ధరకు ఐఫోన్ పొందడం అంత ఈజీ కాదు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. వెంటనే కొనేసుకోవడం బెటర్.
శాంసంగ్, వివో, రియల్‌మి ఫోన్‌లపై బిగ్ డిస్కౌంట్లు :
ఆఫర్లు కేవలం ఐఫోన్లకే కాదు.. ఇతర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A35 5G కేవలం ధర రూ. 17,999కే అందుబాటులో ఉంది. ఇతర డీల్స్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రూ. 18,999, ఒప్పో K13x 5G కేవలం రూ. 9,499 నుంచి లభ్యమవుతున్నాయి. వివో T4x 5G ఫోన్ రూ. 12,499, నథింగ్ ఫోన్ 2 ప్రో కేవలం రూ. 15,999, రియల్‌మి P3x రూ. 10,999కి కొనేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో 10 శాతం తగ్గింపుతో కస్టమర్లు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా, అనేక ప్రొడక్టులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తద్వారా అదనపు సేవింగ్స్ పొందవచ్చు.
సేల్ ఎప్పటివరకంటే? :
ఈ సేల్ అక్టోబర్ 8 వరకు అందుబాటులో ఉంటుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో భారీ డిస్కౌంట్లను కోల్పోయిన వారికి రెండో ఛాన్స్.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.