New Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్లు అదుర్స్.. ఏకంగా 3 మోడల్స్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరు!
New Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్లు వచ్చేశాయి. గెలాక్సీ A07, గెలాక్సీ F07, గెలాక్సీ M07 4G వంటి మోడళ్ల ధరలు, ఫీచర్లు వివరాలపై ఓ లుక్కేయండి.

New Samsung Phones
New Samsung Phones : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఒకేసారి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. పాపులర్ గెలాక్సీ A, F, M సిరీస్‌లకు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.
కొత్తగా రిలీజ్ అయిన ఈ శాంసంగ్ గెలాక్సీ A07, శాంసంగ్ గెలాక్సీ F07, శాంసంగ్ గెలాక్సీ M07 4G ఫోన్లు (New Samsung Phones) 6.7-అంగుళాల HD LCD స్క్రీన్, మీడియాటెక్ హెలియో G99 చిప్‌సెట్, 50MP ప్రైమరీ కెమెరా, 5,000mAh బ్యాటరీతో సహా అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఈ 3 స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఏయే తేడాలేంటి? ధర, కలర్ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ A07, గెలాక్సీ F07, గెలాక్సీ M07 4G భారత్ ధర ఎంతంటే? :
ఈ శాంసంగ్ 3 హ్యాండ్‌సెట్‌లు సింగిల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నాయి. 4GB ర్యామ్, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీ కలిగి ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ A07, గెలాక్సీ F07, గెలాక్సీ M07 4G స్పెసిఫికేషన్లు :
కొత్త శాంసంగ్ ఫోన్లు ఒకేలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు కలిగి ఉన్నాయి.
ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ M07 4G ఫోన్ ధర రూ. 6,999 ఉండగా, బ్లాక్ కలర్ ఆప్షన్‌తో ప్రత్యేకించి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ F07 4G ఫోన్ ధర రూ. 7,699 ఉండగా గ్రీన్ కలర్ ఆప్షన్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A07 4G ధర రూ. 8,999గా ఉంటే.. బ్లాక్, గ్రీన్, లైట్ పర్పల్ కలర్ ఆప్షన్లతో శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే : 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ (720 x 1,600 పిక్సెల్స్) పీఎల్ఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉన్నాయి.
ప్రాసెసర్, స్టోరేజీ : ఈ శాంసంగ్ ఫోన్లకు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G99 చిప్‌సెట్, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ 2TB వరకు విస్తరించవచ్చు.
సాఫ్ట్‌వేర్ : ఈ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతాయి. 6 మెయిన్ OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతాయి.
కెమెరాలు : అన్ని మోడళ్లలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8), 2MP ఎఫ్/2.4 డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్ : ప్రతి ఫోన్ 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ ఫోన్ల కొలతలు 167.4 x 77.4 x 7.6mm, బరువు 184గ్రాములు, దుమ్ము, నీటి నిరోధకతకు IP54 రేటింగ్ కలిగి ఉన్నాయి.