Samsung Galaxy S25 Ultra : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy S25 Ultra : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra

Updated On : October 4, 2025 / 5:46 PM IST

Samsung Galaxy S25 Ultra : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమకు నచ్చిన ఏదైనా స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు.

ఈ ఏడాది సేల్ సమయంలో శాంసంగ్ మోడల్ ఫోన్ (Samsung Galaxy S25 Ultra) స్పెషల్ డీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మీరు శాంసంగ్ అభిమాని అయితే ఈ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం శాంసంగ్ అల్ట్రా ఫోన్ ధర రూ. 17,500 వరకు భారీ తగ్గింపుతో లభిస్తుంది. తక్కువ ధరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోండి. ఈ డీల్ మీకోసమే.. మిస్ చేసుకోవద్దు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ రూ.1,29,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,23,499కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం ఈ సేల్ సమయంలో గెలాక్సీ S25 అల్ట్రాపై రూ.6,500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ ద్వారా అదనంగా రూ.11వేలు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రేడ్ చేయవచ్చు. వర్కింగ్ కండిషన్లు, బ్రాండ్, మోడల్‌ను బట్టి రూ.52,600 వరకు పొందవచ్చు.

Read Also : OnePlus 13 Price Cut : స్టన్నింగ్ ఆఫర్ బ్రో.. వన్‌ప్లస్ 13పై అద్భుతమైన డీల్.. అమెజాన్‌లో ఇప్పుడే కొనడం బెటర్!

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద, ప్రీమియం హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజీతో వస్తుంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ IP68 సర్టిఫికేట్ పొందింది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.