Motorola Edge 50 Fusion : పిచ్చెక్కించే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్.. ధర కేవలం రూ. 18,999 మాత్రమే.. డోంట్ మిస్..!
Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 18,999కే లభిస్తోంది.

Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా అభిమానులకు అద్భుతమైన ఆఫర్. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సందర్భంగా మోటోరోలా ఫోన్ (Motorola Edge 50 Fusion) అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నుంచి 26 శాతం తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై రూ.1900 తగ్గింపు అందిస్తోంది. వన్ కార్డ్‌పై రూ.1250 తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.18,450 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ మోటోరోలా ఫోన్‌తో మీకు రూ.3167 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
ఈ మోటోరోలా ఫోన్ (Motorola Edge 50 Fusion) 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్ అందిస్తుంది. ప్రాసెసర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 2 ప్రాసెసర్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది.
Read Also : iPhone 16 Plus : భలే డిస్కౌంట్ బాస్.. ఐఫోన్ 16 ప్లస్‌పై ఏకంగా రూ. 11,600 తగ్గింపు.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
బెస్ట్ కెమెరా, బ్యాటరీ సెటప్ :
కెమెరా క్వాలిటీ విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP68 రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తుంది.