SwaRail App : వావ్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘SwaRail’తో ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

SwaRail App : ట్రైన్ టికెట్ బుకింగ్ చేస్తున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్లలో స్వారైల్ యాప్ ద్వారా ఈజీగా టికెట్ బుకింగ్ చేయొచ్చు..

SwaRail App : వావ్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘SwaRail’తో ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. స్టెప్ బై స్టెప్ గైడ్..!

SwaRail App

Updated On : May 21, 2025 / 3:39 PM IST

SwaRail App : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారా? ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త ఆల్-ఇన్-వన్ రైల్వే యాప్ స్వరైల్ (SwaRail App) ద్వారా ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ స్వారైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్‌లో రెండింటిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టిక్కెట్లు బుకింగ్, PNR స్టేటస్ ట్రాక్ చేయడం, రైలు రన్నింగ్ స్టేటస్ సహా అన్ని IRCTC సర్వీసులను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందిస్తుంది.

ప్రస్తుతం ఈ స్వారైల్ సూపర్ యాప్ బీటా స్టేజీలో ఉంది. వినియోగదారులు తమ ప్రస్తుత IRCTC రైల్ కనెక్ట్ అకౌంట్లతో లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం ద్వారా ఈ యాప్ యాక్సెస్ చేయవచ్చు. స్వారైల్ యాప్ ద్వారా టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్వారైల్ యాప్.. ఎలా పనిచేస్తుందంటే? :
కొత్త స్వారైల్ యాప్ రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను బుక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఈ యాప్‌లో వినియోగదారులు ఒకే క్లిక్‌తో మల్టీ ఆప్షన్ల ద్వారా నావిగేట్ చేసే ఇంటర్‌ఫేస్ ఉంది. మీరు రైళ్ల కోసం సెర్చ్ చేయొచ్చు. PNR స్టేటస్ చెక్ చేయవచ్చు. మీ కోచ్ లొకేషన్ చూడవచ్చు, రియల్ టైమ్ రైళ్లను ట్రాక్ చేయవచ్చు. ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

రైల్వే అధికారులను హెల్ప్ అడగవచ్చు. మీ ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వొచ్చు. టికెట్ రీఫండ్ కోసం ఫైల్ చేయొచ్చు. అన్నీ హోమ్ స్క్రీన్ నుంచి మాత్రమే యాక్సస్ చేయొచ్చు. ఈ యాప్‌లో ప్రత్యేకమైన ‘My Bookings’ సెక్షన్ కూడా ఉంది. వినియోగదారులు తమ రైల్వే బుకింగ్‌లన్నింటినీ త్వరగా చెక్ చేయొచ్చు.

స్వారైల్ యాప్ ద్వారా లార్జ్ షిప్‌మెంట్ సర్వీసులను కూడా అందిస్తుంది. వినియోగదారులు బాటమ్ బార్ నుంచి మెనూ బటన్ కింద ఎంచుకోవచ్చు.

ఈ సర్వీసు కోసం “Show/Hide Services” కింద “Large Shipment Services” కోసం టోగుల్‌ ఆన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, వినియోగదారులు ఐఫోన్‌లో ఫేస్ ఐడీని వాడటం ద్వారా లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మీ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను స్కాన్ చేయడం ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.

SwaRail యాప్‌లో రైల్వే టిక్కెట్ బుకింగ్ ఎలా? :

  • SwaRail యాప్‌లోకి లాగిన్ అవ్వండి. రిజర్వ్ లేదా రిజర్వ్ చేయని టికెట్ బుకింగ్ ఎంచుకోండి.
  • మీరు బోర్డింగ్ నుంచి డెస్టినేషన్ స్టేషన్‌లను ఎంటర్ చేయండి.
  • మీ ప్రయాణ తేదీని సెట్ చేయండి.
  • ఏ బోగీ క్లాసులో ప్రయాణించాలో అదే ఆప్షన్ ఎంచుకోండి.
  • సెర్చ్ బటన్ ట్యాప్ చేయండి.
  • IRCTC వెబ్‌సైట్ మాదిరిగా రైళ్ల లిస్ట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • రైలును ఎంచుకోండి. అవసరమైన వివరాలను అందించండి.
  • Submit ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • రైల్వే టికెట్ బుకింగ్‌ కన్ఫార్మ్ కోసం పేమెంట్ చేయండి.
  • బుకింగ్ చేసినా టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోండి.