Flipkart Sale 2025 : ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్.. అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

Flipkart Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Flipkart Sale 2025 : ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్.. అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

Apple iPhone 15

Updated On : March 28, 2025 / 2:53 PM IST

Flipkart Sale 2025 : మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్‌ ద్వారా 128GB స్టోరేజీ వేరియంట్ ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. రూ.60,299 ధరకే కొనేసుకోవచ్చు. మార్కెట్లో ఐఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ, ఇప్పుడు మీరు అనేక ఆఫర్లతో అసలు ధర కన్నా అతి తక్కువ ధరకే ఐఫోన్ 15 మోడల్ కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 కొత్త ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Income Tax Returns : ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేస్తున్నారా? జస్ట్ Form 16తో ఇలా సబ్మిట్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డిస్‌ప్లే : ఈ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తుంది.

పర్ఫార్మెన్స్ : ఈ స్మార్ట్‌ఫోన్ బయోనిక్ A16 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ iOS 17పై రన్ అవుతుంది. 2000నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

స్టోరేజ్ : ఈ ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది.

కెమెరా : ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 48MPతో పాటు ఫ్రంట్ కెమెరా 12MP కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా ఉంది.

బ్యాటరీ : ఈ ఐఫోన్ 3394mAh బ్యాటరీతో వస్తుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది.

ఐఫోన్ 15 డిస్కౌంట్లు, ఆఫర్లు :
ఆపిల్ ఐఫోన్ 15 ధర రూ.69,900 ఉండగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 7శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత మీరు ఈ ఐఫోన్ రూ.64999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్‌ కొనుగోలుపై వేల రూపాయలు ఆదా చేయవచ్చు. మరోవైపు, బ్యాంక్ ఆఫర్ కింద అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 650 తగ్గింపు పొందవచ్చు.

Read Also : Poco F7 Ultra : గేమర్లకు పండగే.. పోకో F7 అల్ట్రా ఫోన్ కేక.. ఫీచర్లు కోసమైనా కొనేసుకోవచ్చు..!

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మీరు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 15 కేవలం రూ.60299 ధరకే కొనేసుకోవచ్చు. కానీ, కండిషన్స్ అప్లయ్ అవుతాయి. అప్పుడే చౌకైన ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఐఫోన్ 15 రూ.2286 ఈఎంఐ ఆప్షన్‌తో కూడా పొందవచ్చు.