Poco F7 Ultra : గేమర్లకు పండగే.. పోకో F7 అల్ట్రా ఫోన్ కేక.. ఫీచర్లు కోసమైనా కొనేసుకోవచ్చు..!

Poco F7 Ultra Launch : పోకో F7 అల్ట్రా ఫోన్ అదిరింది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకించి గేమర్ల కోసం స్పెషల్ గ్రాఫిక్స్ కార్డు కూడా ఉంది. ఈ ఫోన్ ధర ఎంతంటే?

Poco F7 Ultra : గేమర్లకు పండగే.. పోకో F7 అల్ట్రా ఫోన్ కేక.. ఫీచర్లు కోసమైనా కొనేసుకోవచ్చు..!

Poco F7 Ultra Launch

Updated On : March 28, 2025 / 2:28 PM IST

Poco F7 Ultra Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా పోకో F7 సిరీస్ వచ్చేసింది. ప్రత్యేకించి పోకో F7 ప్రో, పోకో F7 అల్ట్రా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త పోకో F7 సిరీస్ 6.67-అంగుళాల WQHD+ డిస్‌ప్లే గరిష్టంగా 3,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC పోకో F7 ప్రోకు పవర్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అల్ట్రా మోడల్‌కు పవర్ అందిస్తుంది. పోకో F7 ప్రో 6,000mAh సెల్‌ను కలిగి ఉండగా, పోకో F7 అల్ట్రా 5,300mAh బ్యాటరీని కలిగి ఉంది. అల్ట్రా మోడల్ 2.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP జూమ్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ రెండు వెర్షన్లలో బ్యాక్ సైడ్ 50MP లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది.

Read Also : New Bank Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నుంచి మీ బ్యాంక్ రూల్స్ మారుతున్నాయి.. ఏటీఎం, యూపీఐ పేమెంట్లపై కొత్త నిబంధనలివే!

పోకో F7 అల్ట్రా, పోకో F7 ప్రో ధర, ఫీచర్లు :
12GB+256GB, 16GB+512GB ర్యామ్, స్టోరేజ్ మోడల్స్ పోకో F7 అల్ట్రా ఫోన్ ధర వరుసగా 599 డాలర్లు (సుమారు రూ. 51వేలు), 649 డాలర్లు (సుమారు రూ. 55వేలు). ఎల్లో, బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

పోకో F7 అల్ట్రా ఫీచర్లు :
పోకో F7 అల్ట్రా 6.67-అంగుళాల WQHD+ (1,440×3,200 పిక్సెల్) ఫ్లో అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz గరిష్టంగా 3,200 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. షావోమీ HyperOS 2 ఇంటర్‌ఫేస్ ద్వారా పవర్ పొందుతుంది. డాల్బీ విజన్ HDR10+ డిస్‌ప్లే ద్వారా సపోర్టు అందిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC పవర్ అందిస్తుంది. 512GB వరకు UFS 4.1 స్టోరేజీ, 16GB వరకు LPDDR5X ర్యామ్‌తో వస్తుంది. గేమ్‌లు, ఫిల్మ్‌లలో గ్రాఫిక్స్ ఫ్రేమ్ రేట్ల కోసం (VisionBoost D7) అనే స్పెషల్ గ్రాఫిక్స్ చిప్‌ను కూడా కలిగి ఉంది.

పోకో F7 అల్ట్రాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS సామర్థ్యంతో 1/1.55-అంగుళాల 50MP లైట్ ఫ్యూజన్ 800 ఇమేజ్ సెన్సార్, OISతో 50MP టెలిఫోటో కెమెరా, 32MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 50MP టెలిఫోటో కెమెరా 10cm మాక్రో ఫోటోలను తీయగలదు. 60mm ఫోకల్ లెంగ్త్, 2.5x ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంటుంది. వీడియో చాట్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. IP68 రేటింగ్ కూడా కలిగి ఉంది.

పోకో F7 అల్ట్రాలో కనెక్టివిటీ ఫీచర్లలో నావిగేటర్, NFC, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS/MGPS, Galileo, GLONASS, Beidouతో పాటు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఏఐ పవర్డ్ ఫేస్-అన్‌లాకింగ్ మెకానిజం, డిస్‌ప్లే‌లో ఇంటర్నల్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Read Also : Income Tax Returns : ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేస్తున్నారా? జస్ట్ Form 16తో ఇలా సబ్మిట్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

హై-రెస్ కోసం డాల్బీ అట్మోస్‌తో 2 స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. థర్మల్ కంట్రోల్ కోసం 5,400mm చదరపు డ్యూయల్-ఛానల్ ఐస్‌లూప్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లిక్విడ్‌కూల్ 4.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ కూడా ఉంది. 5,300mAh బ్యాటరీతో పోకో F7 అల్ట్రా వైర్డు 120W లేదా వైర్‌లెస్ 50W ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ బరువు 212 గ్రాములు ఉంటుంది.