Moto G85 5G : ఇది కదా డిస్కౌంట్ అంటే.. మోటో G85 5Gపై ఖతర్నాక్ ఆఫర్.. బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే..!

Moto G85 5G : కొత్త మోటో ఫోన్ కావాలా? బ్యాంకు ఆఫర్లతో మోటో G85 5జీ ఫోన్ కేవలం రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు.

Moto G85 5G : ఇది కదా డిస్కౌంట్ అంటే.. మోటో G85 5Gపై ఖతర్నాక్ ఆఫర్.. బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే..!

Moto G85 5G

Updated On : May 17, 2025 / 6:42 PM IST

Moto G85 5G : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ సేల్‌లో మోటో G85 5G భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ మోటో G85 కొనేందుకు ఇదే సరైన సమయం.

Read Also :  iPhone 15 Plus : ఐఫోన్ 15 ప్లస్‌పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 18,750కే సొంతం కొనేసుకోండి..!

ఫ్లిప్‌కార్ట్ ప్రీమియం, బడ్జెట్ కేటగిరీ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బడ్జెట్ కేటగిరీలో మోటో 5G ఫోన్ డిస్కౌంట్ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. అంటే.. రూ. 20,999 నుంచి రూ. 15,999కి తగ్గింది. రూ. 5వేలు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

మోటో G85 5Gపై డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ మోటో 5జీ ఫోన్‌పై అసలు ధర రూ. 20,999 నుంచి రూ. 5వేలు అదనపు తగ్గింపు అందిస్తోంది. తద్వారా 23శాతం ఆదా చేసుకోవచ్చు.

మోటో G85 5G ఫోన్ ధర రూ. 15,999కి తగ్గుతుంది. మోటో G85పై ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడంపై క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.

మోటో G85 5G ఫీచర్లు :
పర్ఫార్మెన్స్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ సెటప్ (2.3 GHz డ్యూయల్ కోర్ + 2 GHz హెక్సా కోర్) కలిగి ఉంటుంది. రోజువారీ టాస్కులు, గేమింగ్‌కు కూడా అద్భుతంగా ఉంటుంది.

డిస్‌ప్లే : 6.67-అంగుళాల P-OLED కర్వ్డ్ స్క్రీన్, ఫుల్ HD+ రిజల్యూషన్ (1080 x 2400 పిక్సెల్స్), స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

కెమెరా : 50 MP ప్రైమరీ వైడ్ యాంగిల్ లెన్స్ (10x డిజిటల్ జూమ్ వరకు), 8 MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 32MP, సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, USB టైప్-C పోర్ట్ నుంచి 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది.

స్టోరేజీ, ర్యామ్ : 8GB లేదా 12GB ర్యామ్ ఆప్షన్లలో లభిస్తుంది. 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో SD కార్డ్‌తో 2TB వరకు విస్తరించవచ్చు.

కనెక్టివిటీ : 5G సపోర్ట్ ఉంది. డ్యూయల్ సిమ్ (హైబ్రిడ్) స్లాట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. రోజువారీ వినియోగంలో ఎక్కువ ప్రొటెక్షన్ అందిస్తుంది.

Read Also : Vivo T4 5G Sale : పండగ చేస్కోండి.. బ్యాంకు ఆఫర్లతో వివో 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఇలా కొనేసుకోండి!

మోటో G85 5G కొనాలంటే? :
మోటో G85 5G కలర్‌ఫుల్ డిస్‌‌ప్లే , బ్యాటరీ లైఫ్, బెస్ట్ కెమెరాలు, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వర్క్, ఎంటర్‌టైన్మెంట్ వంటి అన్ని అవసరాలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగపడుతుంది.