Vivo T4 5G Sale : పండగ చేస్కోండి.. బ్యాంకు ఆఫర్లతో వివో 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఇలా కొనేసుకోండి!
Vivo T4 5G Sale : వివో కొత్త ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్ సేల్, బ్యాంకు ఆఫర్లతో వివో T4 5G ఫోన్ అతి చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Vivo T4 5G Sale
Vivo T4 5G Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వివో 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. వివో T4 5G (Vivo T4 5G Sale) డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. మిడ్ బడ్జెట్ రేంజ్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేయవచ్చు. ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో అందిస్తోంది. వివో యూజర్లు ఈ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.
వివో T4 5G సేల్, ధర వివరాలివే :
ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నుంచి 14శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపుతో ధర రూ.23,999కు పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 1500 తగ్గింపు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 23,150 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 4వేలు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
వివో T4 5G స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : ఈ వివో ఫోన్ 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో లభిస్తుంది.
పర్ఫార్మెన్స్ : ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. గరిష్ట ప్రకాశంతో 5,000 నిట్స్ అందిస్తుంది.
కెమెరా క్వాలిటీ : ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రాథమిక కెమెరా 50MP, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో వస్తుంది. సెకండరీ కెమెరా 2MP, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది.
Read Also : iPhone 15 Plus : ఐఫోన్ 15 ప్లస్‌పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 18,750కే సొంతం కొనేసుకోండి..!
బ్యాటరీ ఫీచర్ : బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ ఫోన్‌లో భారీ 7300mAh బ్యాటరీని అందిస్తోంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మీ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఫోన్ సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.