Flipkart Summer Days Sale
Flipkart Summer Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సమ్మర్ సేవర్ డేస్ సేల్ (Flipkart Summer Sale)ను ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 13న ప్రారంభమై ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. ఈ ప్లాట్‌ఫారంపై పిక్సెల్ 6a, iPhone 13 వంటి అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. నథింగ్ ఫోన్ (1), రియల్‌మి 10 Pro+ ఫోన్లపై సేల్ ప్రారంభానికి ముందే Flipkart 5G ఫోన్లపై సేల్ డీల్స్ వెల్లడించింది. బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా ధృవీకరించింది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ కింది డీల్స్‌పై ఓసారి లుక్కేయండి.
ఏప్రిల్ 13న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ (Flipkart Summer Sale)లో ఆపిల్ (iPhone 13) స్టోరేజ్ 128GB మోడల్ ధర రూ. 54,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే చాలా తక్కువ ధరకు అమ్ముడవుతోంది. ప్రస్తుతం ఐఫోన్ 13 రూ. 58,999 ధరతో కొనుగోలు చేయొచ్చు. లేటెస్ట్ iPhone 14 కన్నా ఐఫోన్ 13 కొనొచ్చు.
ఎందుకంటే.. ఈ రెండు ఫోన్లలో ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. అంతేకాదు.. చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని సేల్ లిస్టింగ్ ప్రకారం.. Pixel 6a ఫోన్ ధర రూ.26,999కి అందుబాటులోకి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.28,999 తగ్గింపు ధరలో ఉంది. మిడ్-రేంజ్ 5G ఫోన్ గతంలో అద్భుతమైన కెమెరాలతో రూ. 30వేల కన్నా ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది.
Flipkart Summer Days Sale
ఈ ఫ్లిప్ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు (Samsung Galaxy Z Flip 3)ని కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం ఆన్లైన్లో రూ.49,999కి ఈ ఫోన్ విక్రయిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ధరను మరింత తగ్గిస్తుంది. లేటెస్ట్ చిప్ లేదు. క్వాల్కామ్ నుంచి 2021 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 888 SoCని కలిగి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ సమయంలో.. పిక్సెల్ 7 ప్రో ధర కూడా భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ పిక్సెల్ ఫోన్ రూ. 66,999 ధరకు అందుబాటులో ఉంది. కొన్ని రకాల ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. కచ్చితమైన తగ్గింపు ఆఫర్ వివరాలు ఏప్రిల్ 13 నుంచి రివీల్ చేయనుంది. (Redmi Note 12 Pro+)ని కొనుగోలు చేయాలనుకునే యూజర్లు రూ. 27,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1) ధర రూ. 27,999కు మాత్రమే అందుబాటులో ఉంది.