Best Premium Smartphones : ఏప్రిల్ 2023లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Premium Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏప్రిల్ 2023లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Premium Smartphones : ఏప్రిల్ 2023లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best premium flagship smartphones to buy in India this April 2023_ Samsung Galaxy S23 Ultra and 3 more

Best Premium Smartphones : 2023 ఏప్రిల్‌లో కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. భారత మార్కెట్లో అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, అన్ని టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, IP రేటింగ్ వరకు.. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో పొందవచ్చు. ఇంకా ఎక్కువ ధర చెల్లించగలరా? అయితే పర్ఫార్మెన్స్, డిజైన్ పరంగా అనేక బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఎంచుకోవచ్చు.

ఈ ఏప్రిల్‌లో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ డివైజ్‌లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అసాధారణమైన ఫీచర్లతో బెస్ట్ ఫీచర్లను అందిస్తాయి. ద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా సిస్టమ్ లేదా బ్యాటరీ లైఫ్ ఉన్న డివైజ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

1. శాంసంగ్ గెలాక్సీ S23 Ultra :
శాంసంగ్ గెలాక్సీలో (Samsung Galaxy S23 Ultra) మార్కెట్‌లో టాప్-ఆఫ్-లైన్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. ఈ ఫోన్‌పై రూ. 1 లక్ష కన్నా ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటే.. (Galaxy S23 Ultra) ఎంచుకోవచ్చు. గెలాక్సీ S22 అల్ట్రాతో పోలిస్తే.. S23 Ultra కేవలం అప్‌గ్రేడ్ వెర్షన్ మాత్రమే కాదు.. 2023 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా అనేక సరికొత్త ఫీచర్లతో వచ్చింది. AMOLED డిస్‌ప్లే, మల్టీ కెమెరాల సెట్, టైమ్‌లెస్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ S పెన్, Snapdragon 8 Gen 2 చిప్‌తో వచ్చింది. గెలాక్సీ S23 Ultra ఫీచర్లు ఐఫోన్ 14 Pro Max ఫీచర్లకు సమానంగా ఉంటాయి. మీకు బడ్జెట్ సమస్య కాకపోతే, గెలాక్సీ S23 Ultra బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

2. ఆపిల్ ఐఫోన్ 14 Pro Max :
ఐఫోన్ (iPhone 14 Pro) సిరీస్‌లో iPhone 14 Pro Max ఫోన్ బెస్ట్ ఆప్షన్. లగ్జరీ ఫోన్లలో బెస్ట్ డిజైన్‌ అందించే ఆపిల్ అనేక సరికొత్త ఐఫోన్ మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే, iPhone 14 Pro Max కేవలం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అసాధారణమైన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో OLED డిస్‌ప్లే, కెమెరా సిస్టమ్‌తో వచ్చింది.

Best premium flagship smartphones to buy in India this April 2023_ Samsung Galaxy S23 Ultra and 3 more

Best Premium Smartphones : Best premium flagship smartphones to buy in India this April 2023

అదనంగా, ఆపిల్ తమ డివైజ్‌లకు లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుంది, ఐఫోన్ 14 ప్రో సిరీస్ రాబోయే సంవత్సరాల్లో మరింత సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ చేయనుంది. ఐఫోన్ 14 Pro Max నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, బేస్ 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 1,39,900 నుంచి ప్రారంభం అవుతుంది. అత్యుత్తమ డిజైన్‌లు, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. iPhone 14 Pro Max మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

3. శాంసంగ్ Galaxy Z ఫోల్డ్ 4 :
శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 మోడల్.. ప్రస్తుతం కంపెనీ అందించే ఆఫర్లలో అత్యంత అడ్వాన్సడ్ ఫోల్డబుల్ డివైజ్‌గా నిలిచింది. ఇటీవలే లాంచ్ అయిన Tecno Phantom V ఫోల్డ్‌తో సహా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. Galaxy Z Fold 4 ఇప్పటికీ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ఫోన్ గత వెర్షన్ల కన్నా Galaxy Z ఫోల్డ్ 3పై అనేక ఇంక్రిమెంటల్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్లు శాంసంగ్ అత్యుత్తమ AMOLEDలో ఒకటిగా ఉన్నాయి. డిస్ప్లేలు, IPX8 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్, Snapdragon 8+ Gen 1 చిప్ ఫోన్ అందిస్తుంది. ఈ డివైజ్ కెమెరా సిస్టమ్, S పెన్‌కు సపోర్టు అందిస్తుంది. సాధారణ ఫోన్ నుంచి హ్యాండ్‌హెల్డ్ టాబ్లెట్‌గా మార్చవచ్చు. మల్టీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. శాంసంగ్ Galaxy Z Fold 4 మోడల్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.

4. గూగుల్ Pixel 7 Pro :
గూగుల్ సొంత ప్రొడక్ట్ పిక్సెల్ నుంచి 7 సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. 2022లో Pixel 7 Pro లాంచ్ అయింది. అద్భుతమైన కెమెరా ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. అనేక కలర్ ఫుల్ ఫొటోలను తీయగలదు. వివిధ లైటింగ్ పరిస్థితుల్లోనూ వీడియోలు తీసుకోవచ్చు. అయితే, పిక్సెల్ 7 ప్రో అనేది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వడ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో అద్భుతమైన డిజైన్, స్టాక్ ఆండ్రాయిడ్ 13 క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : Reliance Jio True 5G : తెలంగాణ వ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 14 నగరాల్లోకి.. మీరు ఉండే ప్రాంతం ఉందేమో చెక్ చేసుకోండి..!