Reliance Jio True 5G : తెలంగాణ వ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 14 నగరాల్లోకి.. మీరు ఉండే ప్రాంతం ఉందేమో చెక్ చేసుకోండి..!

Reliance Jio True 5G : తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) తమ ట్రూ 5G సర్వీసులను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా మరో 14 నగరాల్లో జియో 5G సర్వీసు (Jio 5G Services)లను ప్రారంభించింది. ఇందులో మీరు ఉండే ప్రాంతం ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.

Reliance Jio True 5G : తెలంగాణ వ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 14 నగరాల్లోకి.. మీరు ఉండే ప్రాంతం ఉందేమో చెక్ చేసుకోండి..!

Reliance Jio launches 5G services in 14 more cities in telangana, Check Full List

Reliance Jio True 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 14 నగరాల్లో జియో 5G సర్వీసులను ప్రారంభించింది. ఈ జియో 5G సర్వీసులు మిర్యాలగూడ, కామారెడ్డి, పాల్వంచ, గద్వాల, ఆర్మూర్, సిరిసిల్ల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, భువనగిరి, బోధన్, వనపర్తి, పెద్దపల్లి, కోరుట్ల, మందమర్రి నగరాల్లోని జియో యూజర్లు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో 19 నగరాలైన హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, మహబూబ్ నగర్, రామగుండం, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేట నగరాల్లో జియో ట్రూ 5G సర్వీసులను ప్రారంభించింది.

జియో కొత్తగా ప్రారంభించిన 14 నగరాలతో మొత్తం 33 నగరాల్లో జియో యూజర్లు 5G సర్వీసులను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలో ప్రతి నగరం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. జియో ట్రూ 5G సర్వీసుల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్‌ను పొందాల్సి ఉంటుంది. జియో ట్రూ 5G సర్వీసులను పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.

Read Also : Airtel-Jio-Tata Play Row : బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై టెలికోల మధ్య వార్.. లైవ్ టీవీ ఛానళ్లను కలపొద్దు.. జియో, ఎయిర్‌టెల్‌పై టాటా ప్లే ఫైర్..!

జియో తెలంగాణ CEO KC రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో జియో ట్రూ 5G సర్వీసులను మరో 14 నగరాలకు విస్తరించాం. జియో 5G సర్వీసులను తక్కువ వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. జియో ఇంజనీర్లు ప్రతి భారత పౌరుడికి ట్రూ -5G ప్రయోజనాలను అందించేందుకు 24 గంటల పాటు పనిచేస్తున్నారు. తెలంగాణను డిజిటలైజ్ దిశగా ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని అన్నారు. ఈ 14 నగరాల్లో జియో యూజర్లు జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer) ఇన్విటేషన్ పొందవచ్చు. తద్వారా జియో యూజర్లు అదనపు ఖర్చు లేకుండా 1 Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను సొంతం చేసుకోవచ్చు.

‘Jio Plus’ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ సర్వీసులివే :
రిలయన్స్ జియో ‘జియో ప్లస్’ అనే కొత్త పోస్ట్ పెయిడ్ ఫామిలీ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ సాయంతో ఫ్యామిలీలోని నలుగురికి కేవలం రూ. 696కు నెలంతా మొబైల్ సర్వీసులు పొందవచ్చు. అంటే.. ఒక యూజర్ గరిష్టంగా 4 కొత్త కనెక్షన్‌లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్ పొందవచ్చు. బెస్ట్ పోస్ట్‌పెయిడ్ సర్వీసులను ఫ్రీగా పొందవచ్చు. జియో ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో మొదటి వినియోగదారునికి నెలకు రూ. 399 ఛార్జీలు వర్తిస్తాయి. అదనంగా, ప్రతీ కనెక్షన్‌కు రూ. 99 మాత్రమే చెల్లించాలి. మొత్తం 4 కుటుంబ సభ్యులకు రూ. 696ల కనీస మొత్తం మాత్రమే చార్జ్ అవుతుంది. ప్రతి సభ్యుడి నెలవారీ మొబైల్ డేటా ఖర్చు రూ. 174గా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తానికి కలిపి సింగిల్ బిల్ వస్తుంది.

Reliance Jio launches 5G services in 14 more cities in telangana, Check Full List

Reliance Jio True 5G : Reliance Jio launches 5G services in 14 more cities in telangana

ఈ ఫ్యామిలీ ప్లాన్ ద్వారా కుటుంబ సభ్యులు తమ డేటాను ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. ఇక, డైలీ డేటా లిమిట్ లేదు. జియో ట్రూ 5G (Welcome Offer) ద్వారా అన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. అంతేకాదు.. మొబైల్ నెంబర్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ప్రీమియం కంటెంట్ ఫ్రీగా పొందవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఫ్రీగా పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్, జియోటీవీ (JioTV), జియో సినిమా యాప్స్ వీక్షించవచ్చు. జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు, ఎస్బీఐ, HDFC, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించనక్కర్లేదు. లేదంటే.. ఇతర నెట్‌వర్క్ నుంచి వెంటనే జియోకు మారవచ్చు. జియో ప్లస్ కనెక్షన్ యూజర్లు 7000070000 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..

మీ నెంబర్ ద్వారా వాట్సాప్‌లో పూర్తి వివరాలు వస్తాయి. (SIM Free Home Delivery) ఫ్రీ హోం డెలివరీ ఆప్షన్ కూడా పొందవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు కోసం సంబంధిత ఆప్షన్ ఎంచుకోవచ్చు. జియో ప్రీపెయిడ్ సిమ్ యూజర్లు ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పొందవచ్చు. జియో యూజర్లు తమ ఫోన్‌లో (MyJio) యాప్ ద్వారా ‘prepaid to postpaid’ ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు OTP వస్తుంది. అది ఎంటర్ చేశాక ఫ్రీ ట్రయల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం www.jio.com/jioplus వెబ్‌సైట్ విజిట్ చేయండి.

Read Also : iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!