×
Ad

Realme C63 5G : ఫ్లిప్‌కార్ట్‌లో మరో కొత్త సేల్.. ఈ రియల్‌మి C63 5G ఫోన్ జస్ట్ రూ. 8,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Realme C63 5G : రియల్‌మి కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్‌లో రియల్‌మి C63 5G అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Realme C63 5G

Realme C63 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్ సందర్భంగా రియల్‌మి ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అందులో రియల్‌మి C63 5G ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ డీల్ సమయంలో మీరు రెండు రియల్‌మి ఫోన్‌లను కేవలం రూ. 1,000 వరకు తక్కువ ధరకు పొందవచ్చు.

రూ. 10వేల బ్రాకెట్‌లో టాప్ రేంజ్ ఫోన్‌ను కొనుగోలు (Realme C63 5G) చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ సేల్ కొన్ని అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఈ ఫోన్ల కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ అన్నీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల నుంచి మొత్తం డిస్కౌంట్ ఎంత అనేది వివరంగా పరిశీలిద్దాం..

రియల్‌మి C63 5G :
128GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB ర్యామ్ మోడల్ ధర 8,999కు పొందవచ్చు. రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఫోన్‌ కొనుగోలు చేస్తే మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ధర రూ. 7,550 వరకు తగ్గుతుంది.

Read Also : Jio Best Offer : జియో బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. మీకూ మెసేజ్ వచ్చిందా? ఇలా చెక్ చేసుకోండి..!

ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ రియల్‌మి ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఐ-కంఫర్ట్ స్క్రీన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో కంపెనీ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌గా రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 32MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఒప్పో K12x 5జీ ధర ఎంతంటే? :

6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఫోన్ ధర రూ. 12,999కు లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ రూ. 750 వరకు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు కార్డ్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ. 7,700 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 1604 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే కంపెనీ నుంచి అందుబాటులో ఉంది. డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120Hz, గరిష్ట బ్రైట్‌నెస్ లెవల్ 1000 నిట్స్ సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ 5100mAh బ్యాటరీ, 45W స్పీడ్ ఛార్జింగ్ మిలిటరీ-గ్రేడ్ మన్నిక కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఒప్పో ఫోన్‌లోని ప్రైమరీ కెమెరా 32MP కలిగి ఉంది. కంపెనీ సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ColorOS 14 ఫోన్‌కు పవర్ అందిస్తుంది.