Flipkart Free Netflix : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేశారంటే ప్రతినెలా ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు..!
Flipkart Free Netflix : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందాలంటే నెలవారీగా నాలుగు ఆర్డర్‌లను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఆ తర్వాతే మీకు ఈ ఫ్రీ ఆఫర్ అందుతుంది.
- Sreehari A
- Published on- August 3, 2026 / 01:50 PM IST
Flipkart Free Netflix
- ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అద్భుతమైన ఆఫర్
- నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు
- అర్హులైన సభ్యులకు మాత్రమే ఈ బెనిఫిట్
Flipkart Free Netflix : ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. మీకు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ వస్తుంది తెలుసా? అది ఎలా అంటారా? మీరు ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులై ఉండాలి.. అప్పుడే మీకు ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా 30 రోజుల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు. అర్హులైన సభ్యులకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది.
ఈ-కామర్స్ దిగ్గజం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే, ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో నెలవారీ షాపింగ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఇంతకీ అవేంటి? ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఎలా పొందాలి? :
ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో (Flipkart Free Netflix) రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత, అర్హత గల సభ్యులు ఒకే క్యాలెండర్ నెలలో 4 ఆర్డర్‌లను పూర్తి చేయాలి. అందులో ప్రతి ఆర్డర్ వాల్యూ కనీసం రూ. 299 ఉండాలి. ఈ 4 ఆర్డర్‌లు ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలలో ఎందులో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే, క్యాన్సిల్ చేయడం లేదా రీఫండ్ ఆర్డర్లను కౌంట్ చేయరు.
నాల్గో ఆర్డర్ పూర్తయిన తర్వాత యూజర్లు ఒక నెల నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రతి నెలా కావాలంటే మీరు ప్రతి నెలా ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌లు చేస్తుండాలి. తద్వారా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా మీకు కంటిన్యూ అవుతుంది.
ఈ ఆఫర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే.. మీరు ఆఫర్‌ను మాన్యువల్‌గా క్లెయిమ్ చేసుకోవాలి. 4 నెలల ఆర్డర్‌లు పూర్తి చేశాకే ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని ‘My Account’కు వెళ్లి, ‘Plus’పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ‘Cliam’ లేదా ‘Activate’ అనే ఆప్షన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ కనిపిస్తుంది.
ఆ తర్వాత మీ ప్రస్తుత నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లింక్ చేయాలి లేదా మీ ఈమెయిల్ అడ్రస్ లేదా మొబైల్ నంబర్‌తో కొత్త నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దీనికి యాక్టివేషన్ తప్పనిసరి. ప్రస్తుతం ఈ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ఆఫర్ లిమిటెడ్ సర్వీసు మాత్రమే.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులందరికీ వెంటనే కనిపించదు. ఒకవేళ ఆఫర్ అందుబాటులో లేదంటే మీరు ఇంకా వెయిట్‌లిస్ట్‌లో ఉండే అవకాశం ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ :
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌తో ఒకేసారి ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ (SD) క్వాలిటీలో OTT కంటెంట్‌ను చూడొచ్చు. ఇందులో భారత్‌లో లభించే నెట్‌ఫ్లిక్స్ ఫుల్ కంటెంట్ కేటలాగ్ మాత్రమే ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ కేవలం మొబైల్ డివైజ్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీని కారణంగా మీరు టీవీలు, ల్యాప్‌టాప్‌లు/డెస్క్‌టాప్‌లలో యాక్సస్ చేయలేరు. HD లేదా అల్ట్రా HD స్ట్రీమింగ్‌కు సపోర్టు ఇవ్వదు. మల్టీ డివైజ్‌ల్లో ఒకేసారి కంటెంట్ చూడలేరు.
