Fuel Crisis : ఈ పెట్రోల్, డీజిల్ కష్టాలు వద్దే వద్దు.. రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 421 కి.మీ!

Fuel Crisis : ఏంటి.. ఈ పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బాబోయే మా వల్ల కాదు.. ఈ కష్టాలు ఎవరు పడతారు.. అనిపిస్తోందా? టెన్షన్ పడొద్దు.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.. ఇందులో మీకు ఏది కావాలో కొనేసుకోండి.

Affordable Electric Cars ( Image Credit : Gemini AI )

  • పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద భారీగా క్యూలు
  • ఇంధన ధరల పెంపుతో వాహనదారుల ఇక్కట్లు
  • ఫ్యూయిల్ బండ్లు కన్నా కరెంట్ బండ్లే బెటర్ అంటున్న వాహనాదారులు

Fuel Crisis : బాబోయ్.. పెట్రోల్, డీజిల్ దొరకడమే కష్టంగా మారింది. ఈ ఫ్యూయిల్ బండ్లు నడపడం ఇక మావల్ల కాదులే అనిపిస్తోందా? ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టమైపోయింది. బంక్‌ల దగ్గర భారీగా క్యూలు దర్శనమిస్తున్నాయి.

ఇంధన ధరల పెరుగుదలతో కార్లు, బైకులు నడపడం భారంగా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవడం బెటర్. ఎందుకంటే హాయిగా ఇంట్లోనే ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే టెన్షన్ లేకుండా ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు.

బంకుల వద్ద క్యూలకు  గుడ్ బై :
పెట్రోల్ బంక్ దగ్గర భారీ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. ఆ టెన్షన్‌కు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. సరికొత్తగా వస్తున్న సర్వీసులతో మనం ఫుడ్ ఆర్డర్ చేసినట్లే.. పెట్రోల్, డీజిల్ కూడా ఇంటికే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ సర్వీస్ బాగా పాపులర్ అవుతోంది.

భారత మార్కెట్లో చాలా కంపెనీలు డీజిల్‌ను డోర్‌స్టెప్‌ డెలివరీ చేస్తున్నాయి. ఇండస్ట్రియల్, కమర్షియల్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈ సర్వీసులను అందిస్తున్నాయి. తద్వారా మీ టైమ్ సేవ్ అవుతుంది. అన్ని పనులు స్మూత్‌గా అవుతాయి. భవిష్యత్తులో ఇది సామాన్యులకూ కూడా అందుబాటులోకి రానుంది.

ఇక EV కార్ల వైపు మళ్లే సమయం :
పెట్రోల్, డీజిల్ బాధలు తప్పాలంటే ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్ ఆప్షన్‌. ఎందుకంటే.. తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్, ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు ధరలో అద్భుతమైన ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లితే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు అనమాట.

Read Also : Mahindra XUV700 : మీ డ్రీమ్ కారు ఇదేనా? మహీంద్రా XUV700 కొనేందుకు మీ జీతం ఎంత ఉండాలో తెలుసా? పూర్తి EMI లెక్కలివే!

రూ.10 లక్షల లోపు టాప్ EV కార్లు :
ఈ బడ్జెట్‌లో అద్భుతమైన రేంజ్ అందించే ఈవీ కార్లు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ సుమారు 315 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. ఎంజీ కోమెట్ ఈవీ సిటీ డ్రైవింగ్‌కు బాగా సెట్ అవుతుంది. ఈ కారు రేంజ్ సుమారు 230 కి.మీ. టాటా పంచ్ ఈవీ 315కి.మీ నుంచి 421 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్.

టాటా టియాగో ఈవీ (లాంగ్ రేంజ్) :
ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ఫ్యామిలీ కస్టమర్లకు ఫుల్ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో 24kWh బ్యాటరీ ఉంది. సింగిల్ చార్జ్ చేస్తే సుమారు 315కి.మీ వరకు దూసుకెళ్తుంది. సిటీలోనే కాదు లాంగ్ డ్రైవ్ కూడా అద్భుతంగా ఉంటుంది.

నార్మల్ పెట్రోల్ కారు సైజ్‌లో 4 నుంచి 5 మంది కంపర్ట్ గా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆప్షన్ ఉంది. వెంటనే చార్జ్ అవుతుంది. ధర కూడా మిడిల్ క్లాసు వారికి రూ. 8.5 లక్షల నుంచి లభ్యమవుతుంది. మొత్తంగా చూస్తే అన్ని అవసరాలకు సరిగ్గా సరిపోయే కారు అని చెప్పొచ్చు.

ఎంజీ కామెట్ ఈవీ :
చిన్న సైజ్‌లో ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ మోడల్ సిటీ కారుకు బెస్ట్. 17.3kWh బ్యాటరీతో సుమారు 230కి.మీ రేంజ్ అందిస్తుంది. చిన్నగా ఉండటంతో ట్రాఫిక్‌లో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. పార్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది.

కానీ, సైజ్ చిన్నది కావడంతో ఎక్కువ మంది కూర్చొలేరు. ఎక్కువదూరం ప్రయాణాలకు సరిపోదు. బూట్ స్పేస్ సైతం చాలా తక్కువే. ఫీచర్లు విషయానికి వస్తే టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లు చాలా మోడర్న్‌గా ఉంటాయి. ఈవీ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీ బడ్జెట్‌ ధరలో సిటీలో తిరిగేందుకు ఈ ఎలక్ట్రిక్ కారు తీసుకోవచ్చు.

టాటా పంచ్ ఈవీ :
ఈ ఎలక్ట్రిక్ కారు SUV లుక్‌లో కిర్రాక్ ఉంటుంది. టియాగో కన్నా కొంచెం పెద్దదిగా చాలా స్ట్రాంగ్‌ ఉంటుంది. ఇందులో 25kWh, 35kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఎక్కువ బ్యాటరీతో 315కి.మీ నుంచి 421కి.మీ వరకు రేంజ్ దూసుకెళ్తుంది.

గ్రామీణ రోడ్లు, గుంతల రోడ్లలో కూడా వేగంగా వెళ్తుంది. ఫ్యామిలీకి సరిపడేలా స్పేస్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, కొత్త ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ రూ. 10 లక్షల దగ్గర నుంచి ఉంటుంది. ఫ్యామిలీ, కొంచెం అడ్వెంచర్, ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.