Mahindra XUV700 : మీ డ్రీమ్ కారు ఇదేనా? మహీంద్రా XUV700 కొనేందుకు మీ జీతం ఎంత ఉండాలో తెలుసా? పూర్తి EMI లెక్కలివే!
Mahindra XUV700 : మీరు మహీంద్రా XUV700 కొనాలని అనుకుంటే మీ జీతం ఎంత ఉండాలో తెలుసా? నెలకు EMI ఎంత కట్టాలో తెలుసా? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Mahindra XUV700
- మహీంద్రా XUV700 కారు మార్కెట్లో ధర ఎంత ఉంది?
- ప్రీమియం SUV మోడల్ ప్రారంభ ధర రూ. 13.66 లక్షలు
- 25శాతం డౌన్ పేమెంట్.. రూ. 17 లక్షల లోన్ అవసరం
Mahindra XUV700 : కొత్త మహీంద్రా SUV కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియం SUVని కొనాలని అనుకుంటే మహీంద్రా XUV700 అద్భుతమైన ఆప్షన్. కానీ, ఈ కారును కొనుగోలు చేసే ముందు కేవలం ధర ఒక్కటే తెలుసుకుంటే సరిపోదు.
మీ జీతం ఈఎంఐ, ఇతర ఖర్చులను కూడా మీరు బ్యాలెన్స్ చేయగలరా? లేదా అనేది కూడా చూసుకోవాలి. మహీంద్రా XUV700 ధర రూ. 13.66 లక్షల నుంచి ప్రారంభమై రూ. 23.71 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
మిడ్-స్పెక్ వేరియంట్ (AX5) ఆన్-రోడ్ ధర సుమారుగా రూ. 22 లక్షలకు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ SUV మోడల్ కొనాలంటే మీ జీతం ఎంత ఉండాలి? ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Read Also : SBI YONO : ఎస్బీఐ YONO కస్టమర్లకు బిగ్ వార్నింగ్.. మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? ఈ పొరపాటు అసలు చేయొద్దు..!
డౌన్ పేమెంట్, లోన్ లెక్కలివే :
మీరు 25శాతం డౌన్ పేమెంట్ అంటే.. రూ. 5 లక్షలు చెల్లిస్తే.. మీరు సుమారుగా రూ. 17 లక్షల లోన్ తీసుకోవాలి. మీరు 9శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలానికి లోన్ తీసుకుంటే మీ నెలవారీ ఈఎంఐ సుమారుగా రూ. 35,289 అవుతుంది. 5 ఏళ్ల కాలంలో మొత్తం వడ్డీ సుమారుగా రూ. 4.17 లక్షలు అవుతుంది. అంటే.. మీరు కారు అసలు ధర కన్నా భారీగా చెల్లిస్తున్నారని అర్థం.
జీతం ఎంత ఉండాలి? :
ఆర్థిక నిపుణుల ప్రకారం.. మీ ఈఎంఐ మీ జీతంలో 15 శాతం నుంచి 20శాతం మించకూడదు. అందుకే మీ జీతం రూ. 1.2 లక్షల కన్నా ఎక్కువగా ఉండాలి. ఒకవేళ మీ జీతం రూ. 80,000 నుంచి రూ.1 లక్ష మధ్య ఉండి మీకు వేరే ఏ అప్పులూ లేనట్లయితే మీరు ఈ కారును కొనేసుకోవచ్చు. ఈఎంఐ కాకుండా, ఈ ఖర్చులు కూడా ఉంటాయి. SUV కొన్నాక ఈఎంఐ మాత్రమే కాకుండా ప్రతి నెలా అనేక ఇతర ఖర్చులు కూడా పెరుగుతాయి. అవి ఏవంటే..
ఇంధన ఖర్చులు : రూ. 6,000 నుంచి రూ.10,000
మెయింట్ నెన్స్ ఖర్చులు : రూ. 1,000 నుంచి రూ. 1,500
ఇన్సూరెన్స్ : సుమారు రూ. 5000 (నెలవారీ సగటు)
మీ నెలవారీ ఖర్చులు : రూ. 48వేల నుంచి రూ. 50వేల వరకు
ఈఎంఐ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి? :
మీ జీతం రూ. లక్ష కన్నా తక్కువగా ఉంటే ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం మంచిది. మీరు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. మీ నెలవారీ ఈఎంఐ రూ. 16వేల నుంచి రూ.20వేలకు తగ్గవచ్చు.
