Raksha Bandhan 2026 : రక్షాబంధన్ ఎప్పుడు..? ఆగస్టు 27నా.. 28నా?.. రాఖీ ఏ సమయంలో కట్టాలి.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
Raksha Bandhan 2026 : 2026లో ఆగస్టు 27, 28 రెండు తేదీలు ప్రస్తావించడంతో రాఖీ పండుగ విషయంలో గందరగోళం నెలకొంది.
Raksha Bandhan 2026
Raksha Bandhan 2026 : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ రక్షాబంధన్. సంస్కృతంలో రక్ష అంటే రక్షణ.. బంధన్ అంటే బంధం అని అర్ధం. అంటే ఇది రక్షణకు సంబంధించిన పవిత్రమైన బంధం అని అర్ధం. ఈసారి రక్షాబంధన్ రోజున సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు అందుకొనేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ పండుగ తేదీపై కాస్త సందిగ్దిత నెలకొంది.
Also Read : Golconda Fort : గోల్కొండ కోట సమీపంలో ‘రహస్య సొరంగం’ కలకలం.. పురావస్తు శాఖ అసలు నిజం ఏంటో చెప్పేసింది..
2026లో ఆగస్టు 27, 28 రెండు తేదీలు ప్రస్తావించడంతో రాఖీ పండుగ విషయంలో గందరగోళం నెలకొంది. మరి అసలు పండుగ ఏరోజు జరుపుకోవాలి అనేదానిపై చాలా మందిలో స్పష్టత లేదు. ఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 28వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. హిందూ పంచాంగం ప్రకారం.. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28న ఉదయం 9.48 గంటలకు ముగుస్తుంది. ఇక ఉదయం తిథి ప్రకారంగా చూస్తే ఆగస్టు 28న రాఖీ పండుగను జరుపుకుంటారు. కాబట్టి పండితులు కూడా అదే రోజు జరుపుకోవాలని చెబుతున్నారు.
ఆగస్టు 28న భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగుస్తుందని హిందూ పంచాంగ ప్రకారం తెలుస్తోంది. దీంతో ఉదయం రాఖీ కట్టేందుకు శుభ సమయం అందుబాటులో ఉంటుంది. అయితే శుభ ముహూర్తం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు, కాబట్టి స్థానిక పంచాంగాన్ని అనుసరించడం మంచిది.
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం వస్తుంది.. దీంతో గ్రహనం వేళ రాఖీ కట్టవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండితులు చెబుతున్న ప్రకారం.. చంద్రగ్రహణం భారత్ లో కనిపించదు.. అంతేకాకుండా సూతక కాలం కూడా వర్తించదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఆనందంగా రాఖీ కట్టుకోవచ్చునని చెబుతున్నారు.
