Home » Telangana Assembly Election 2023
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అది బీజేపీ ఘనత అని అన్నారు కిషన్ రెడ్డి. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వం 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరింది.
జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
బీజేపీకి సహకరించారన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. పార్టీకి తాము వ్యతిరేకమని, మతోన్మాదానికి దూరమని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, తమ గెలుపుకోసం ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు
అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన వివరాలను ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించారు. అధిష్టానం సాయంత్రం వరకు సీఎల్పీ నేత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పార్టీల వారిగా ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 39.40శాతం, బీఆర్ఎస్ పార్టీకి 37.35శాతం, బీజేపీకి 13.90శాతం, ఏఐఎంఐఎంకు 2.22శాతం, సీపీఐ పార్టీకి 0.34శాతం ఓట్లు పోలయ్యాయి.
కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.