Telangana Mlc : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో పరాజయం పాలైన నేతలు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకోవాలని తహ తహ లాడుతున్నారు....

Telangana Mlc : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

telangana legislative council

Telangana Mlc : అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో పరాజయం పాలైన నేతలు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకోవాలని తహ తహ లాడుతున్నారు. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యాక అమాత్య పదవులు పొందాలని యోచిస్తున్నారు.

ALSO READ : Gutka Ad Case : ముగ్గురు ప్రముఖ సినీనటులకు కోర్టు నోటీసుల జారీ…ఎందుకంటే…

బీఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురు ఎమ్మెల్సీలు విజయం సాధించడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో వారి రాజీనామాలను తెలంగాణ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే ఆమోదించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ALSO READ : Telangana Polls to Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

దీంతో నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇందులో రెండు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయించుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ఎమ్మెల్సీల భర్తీపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించనుంది. ఇందులో నాలుగు ఎమ్మెల్సీ పదవుల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది.

ALSO READ : Mahalakshmi Scheme: ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం చేసిన మహిళలతో మాట్లాడినా జగ్గారెడ్డి

ఎన్నికలు జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ముందుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను పొందాలని కాంగ్రెస్ నేతలు గురి పెట్టారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేటీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం పేరు వినిపిస్తోంది. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ముగ్గురు పోటీ చేసినా వారంతా ఓటమి పాలయ్యారు. దీంతో తెలంగాణ మంత్రివర్గంలో ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థికి చోటు కల్పించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

ALSO READ : Telangana Govt : రేవంత్ మార్క్.. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

దీంతో ఓడిపోయిన నేతలు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ లలో ఒకరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తంమీద అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవులపై కసరత్తు సాగుతోంది. ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయో, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం వేచిచూడాల్సిందే.