Telangana Govt : రేవంత్ మార్క్.. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కులో పాలన ప్రారంభించారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు.

Telangana Govt : రేవంత్ మార్క్.. ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

Telangana Govt

Updated On : December 9, 2023 / 5:19 PM IST

Telangana Govt : సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కులో పాలన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే సచివాలయానికి వచ్చారు. విద్యుత్ శాఖపై సమీక్షలు చేశారు. తాజాగా..ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేశారు. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిలో తెలంగాణ మాజీ సీఎం సోమేశ్ కుమార్, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్,జీఆర్ రెడ్డి, ఆర్. శోభల నియామకాలు రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాగా..గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారులను కాంగ్రెస్ ప్రభత్వం రద్దు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.