Gutka Ad Case : ముగ్గురు ప్రముఖ సినీనటులకు కోర్టు నోటీసుల జారీ…ఎందుకంటే…

ముగ్గురు సీనియర్ సినీనటులకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు ఇచ్చింది. గుట్కా ప్రకటనల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది....

Gutka Ad Case : ముగ్గురు ప్రముఖ సినీనటులకు కోర్టు నోటీసుల జారీ…ఎందుకంటే…

Ajay Devgn,Akshay Kumar, SRK

Gutka Ad Case : ముగ్గురు సీనియర్ సినీనటులకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు ఇచ్చింది. గుట్కా ప్రకటనల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది. గుట్కా కంపెనీలకు ప్రకటనలు ఇస్తున్న నటీనటులు, ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ వాదించారు.

ALSO READ : IND-W vs ENG-W 2nd T20 : భారత్ ఘోర ఓటమి.. రెండో టీ20లో ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

దీనిపై చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ రాజేష్‌సింగ్‌ చౌహాన్‌తో కూడిన ధర్మాసనం గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 22వతేదీన ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదించారు. అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే శుక్రవారం హైకోర్టుకు తెలిపారు.

ALSO READ : Telangana Polls to Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

అమితాబ్ బచ్చన్ గుట్కా కంపెనీకి లీగల్ నోటీసు పంపారని, దాంతో అతను ఇప్పటికే తన ఒప్పందాన్ని అమితాబ్ రద్దు చేసుకున్నారు. అయినా అమితాబ్ ప్రకటనను ప్రదర్శిస్తున్నారని కోర్టుకు సమాచారం అందింది.