KCR : తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సమావేశం శనివారం నాడు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు....

KCR :  తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్

Telangana opposition leader KCR

Former Telangana CM KCR : బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సమావేశం శనివారం నాడు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో  ఆ పార్టీ నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నారు.  అసెంబ్లీ సమావేశాలకు ముందు కొత్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 మంది తెలంగాణ భవన్ లో సమావేశమై కేసీఆర్ ను తమ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్ శాసన సభ పక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ శాసన సభ పక్ష సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం  తెలంగాణ భవన్ నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి బయలు దేరారు. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి అసెంబ్లీ కి వెళ్లారు.  బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యవర్గం ఎంపిక అధికారం బీఆర్‌ఎస్ఎల్పీ నేతకు కట్టబెడుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ALSO READ : CM Revanth Reddy : సీనియర్లకు కీలక శాఖలు..! ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

కేసీఆర్ కాలి తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. కేసీఆర్ మరో 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు శనివారం రాకున్నా ఆయన్నే సభానేతగా ఎన్నుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే అసెంబ్లీలో తన వాణిని వాడి వేడిగా వినిపిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ALSO READ : MLA Raja Singh : అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నాం.. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణం చేయం : ఎమ్మెల్యే రాజసింగ్

కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో బీఆర్ఎస్ సభా పక్ష నేత ఎన్నిక కాగానే శాసన సభ్యులందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసీఆర్ కు అన్ని అంశాలపై పట్టు ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఆ పార్టీని శాసనసభలో నిలదీసేలా మాట్లాడే కేసీఆర్ సభాపక్ష నేతగా అయితేనే బాగుంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపితే వాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.

ALSO READ : Gaddam Prasad : నేను స్పీకర్ అయ్యాక.. ప్రతిపక్షానికి కూడా మంచి అవకాశం ఇస్తా- గడ్డం ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు, మిత్రపక్షమైన సీపీఎంకు ఒకరు ఉన్నారు. బీఆర్ఎస్ కు 39 మంది, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులున్నందున ప్రధాన ప్రతిపక్షం బలమైన వాదనను వినిపించనుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మొత్తంమీద అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడివేడిగా జరగనున్నాయి.