Gaddam Prasad : నేను స్పీకర్ అయ్యాక.. ప్రతిపక్షానికి కూడా మంచి అవకాశం ఇస్తా- గడ్డం ప్రసాద్

గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ప్రజా ప్రభుత్వంలో పాలన ఎలా ఉంటుందో చూపిస్తాం. నాకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ స్పీకర్ పదవి అందుకు భిన్నమైన రోల్.

Gaddam Prasad : నేను స్పీకర్ అయ్యాక.. ప్రతిపక్షానికి కూడా మంచి అవకాశం ఇస్తా- గడ్డం ప్రసాద్

Mla Gaddam Prasad Kumar On Assembly Speaker Post

Updated On : December 8, 2023 / 11:01 PM IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కాంగ్రెస్ తరపున గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోతే ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు. గతంలో మంత్రిగా పని చేసిన గడ్డం ప్రసాద్.. స్పీకర్ గా అవకాశం ఇస్తే భిన్నమైన పాత్ర పోషిస్తాను అని చెన్నారు. ప్రోటోకాల్ పాటిస్తూనే తన నియోజకవర్గం వికారాబాద్ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు.

”పార్టీ ఆదేశం మేరకు స్పీకర్ గా నామినేషన్ వేస్తున్నా. రేపు(డిసెంబర్ 9) ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత సాయంత్రం నామినేషన్ వేసే అవకాశం ఉంది. నామినేషన్ లో భాగంగా ప్రతిపక్షాల నుంచి ఎవరైనా పోటీలో ఉంటారా లేదా అనేది చూడాలి. నామినేషన్ ఎవరూ వేయకపోతే ఏకగ్రీవంగా ఎన్నికవుతా. నేను స్పీకర్ అయ్యాక.. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా మంచి అవకాశం కల్పిస్తా.

Also Read : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నిబంధనలు ఇవే

గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ప్రజా ప్రభుత్వంలో పాలన ఎలా ఉంటుందో చూపిస్తాం. నాకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ స్పీకర్ పదవి అందుకు భిన్నమైన రోల్. స్పీకర్ గా ప్రోటోకాల్ ను పాటిస్తూనే నియోజకవర్గ అభివృద్ధిని కూడా సాధిస్తా” అని గడ్డం ప్రసాద్ అన్నారు.

”నిన్ననే లిస్టులో నా పేరు రావడం జరిగింది. ఇది గొప్ప అవకాశం. రాష్ట్ర ముఖ్యమంత్రి నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. అధికారపక్ష స్పీకర్ గా ఉన్నా.. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా సమయాన్ని కేటాయించి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తాను. సభ హుందాతనాన్ని పెంచే విధంగా సభను నడిపిస్తా.

Also Read : 3రోజుల్లో 7కోట్లు చెల్లించాలి.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ డెడ్‌లైన్

స్పీకర్ పదవి రాజ్యాంగపరమైన పదవి. కాబట్టి ప్రతిపక్షాన్ని, అధికారపక్షాన్ని సమానంగా చూస్తా. ప్రతిపక్షం అడిగే అన్ని ప్రశ్నలకు ప్రభుత్వపరంగా అధికారపక్షంతో సమాధానాలు ఇప్పించే బాధ్యత నాపై ఉంటుంది. తప్పకుండా అందరికీ అవకాశం ఇస్తాను. సభ సజావుగా సాగేందుకు ప్రయత్నిస్తా. స్పీకర్ పదవి చాలా పెద్ద బాధ్యత. మంత్రి పదవి అంటే ఎక్కడైనా తిరగొచ్చు. రాష్ట్ర పర్యటనలు చేయొచ్చు. కానీ స్పీకర్ పదవి రాజ్యాంగానికి సంబంధించిన పదవి. ప్రోటోకాల్ ను పాటిస్తూ నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా” అని గడ్డం ప్రసాద్ చెప్పారు.