Free Bus Travel : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వారికి మాత్రమే ఫ్రీ, ఆ బస్సుల్లోనే ఉచితం.. మార్గదర్శకాలు జారీ

ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

Free Bus Travel : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వారికి మాత్రమే ఫ్రీ, ఆ బస్సుల్లోనే ఉచితం.. మార్గదర్శకాలు జారీ

Free Bus Travel For Women

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల వరకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. తెలంగాణ పరిధిలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. డిసెంబర్ 9 మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే అనుమతి ఉంది. అంతరాష్ట్ర బస్సుల విషయానికి వస్తే తెలంగాణ పరిధి వరకు మాత్రమే ఉచితం. ఆ తర్వాత టికెట్ తీసుకోవాల్సిందే. మొదటి వారం రోజుల వరకు ఎలాంటి ఐడెంటీ కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చు.

ఉచిత బస్సు ప్రయాణం రేపటి(డిసెంబర్ 9) నుంచి అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతి బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్యను కూడా కండక్టర్లు విధిగా వివరాలు రాసుకోవాలి. దీనికి మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అని పేరు పెట్టింది ప్రభుత్వం.

Also Read : అలాంటి ప్రయాణాలకు అనుమతి లేదు- ఉచిత బస్సు ప్రయాణంపై సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

 

Free Bus Travel For Telangana Women

Free Bus Travel For Telangana Women

ఎవరెవరికి ఫ్రీ – బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం
ఎప్పటి నుంచి – డిసెంబర్ 9, 2023 నుంచి అమలు
ఏయే బస్సుల్లో – సిటీ, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్
పరిమితులు – తెలంగాణ పరిధి

Also Read : నిజమైన తెలంగాణ వచ్చింది.. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి : జీవన్ రెడ్డి

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. నిబంధనలు ఇవే
* తెలంగాణ మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం
* డిసెంబర్ 9 నుంచి అమల్లోకి
* టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
* మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
* తెలంగాణలో తిరిగే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
* రాష్ట్రం దాటి వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణ బోర్డర్ వరకే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం. ఆ తర్వాత టికెట్ తీసుకోవాలి.
* తెలంగాణ మహిళలు బస్సుల్లో ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుంది.
* మహిళలు ప్రయాణించిన దూరాన్ని తెలుసుకోవడానికి వీలుగా త్వరలో వారికి మహాలక్ష్మి స్మార్ట్ కార్డు ఇవ్వనున్న అధికారులు.