Jeevan Reddy : నిజమైన తెలంగాణ వచ్చింది.. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వ పాలన సమైఖ్యఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగిందని విమర్శించారు.

Jeevan Reddy : నిజమైన తెలంగాణ వచ్చింది.. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి : జీవన్ రెడ్డి

Jeevan Reddy

Jeevan Reddy Medigadda project : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వ పాలన సమైఖ్యఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అప్పురూ.6లక్షల కోట్లు దాటిపోయిందని.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక లోపాలున్నాయని..ప్రాజెక్టు నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖనే చెప్పిందని గుర్తుచేశారు.ఆ ప్రాజెక్ట్ కి అనుమతి కూడా లేదని..రూ.లక్ష 20 వేల కోట్లు ఆర్ధిక భారం పడిందన్నారు.ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాలుగా కేసీఆరే బాధ్యుడని అన్నారు., ఆ ప్రాజెక్ట్ కి CWC అనుమతి కూడా లేదనే విషయాన్ని కేంద్రమే చెప్పిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్భార్‌పై దివ్యాంగుడు ఏమన్నాడంటే..

మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని..బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకులోవాలని కోరారు.విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై
వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షణీయమని అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియచేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందున తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చెయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చెయ్యాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.మహిళలకు ఉచిత ప్రయాణంపై సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి అమలుకు నిర్ణయం తీసుకోవడం ఆనందించాల్సిన విషయమన్నారు.

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలపై ఆసక్తి