VC Sajjanar : అలాంటి ప్రయాణాలకు అనుమతి లేదు- ఉచిత బస్సు ప్రయాణంపై సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం.

VC Sajjanar : అలాంటి ప్రయాణాలకు అనుమతి లేదు- ఉచిత బస్సు ప్రయాణంపై సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

Sajjanar On Free Bus Travel

తెలంగాణలో రేపటి(డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంలో భాగంగా రేపటి నుంచి తెలంగాణ పరిధిలో టీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడినా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో తెలంగాణ పరిధిలో మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. టీఎస్ ఆర్టీసీకి అయ్యే ఖర్చుని ప్రభుత్వం రీఎంబర్స్ చేయనుంది.

మహిళల ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్.. అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. రేపు మధ్యాహ్నం నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు. తెలంగాణ పరిధి వరకు మాత్రమే ఉచిత ప్రయాణం చేయొచ్చు.

Also Read : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నిబంధనలు ఇవే

కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో మహాలక్ష్మి పథకం రేపట్నుంచి (డిసెంబర్ 9) ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ”మహిళలకు ఉచిత ప్రయాణం రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేస్తారు. మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టికెట్లు జారీ చేసి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉచితంగా జీరో టికెట్లు జారీ చేస్తాం. ప్రజా రవాణ వ్యవస్థలో ఇది చారిత్రక నిర్ణయం.

భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం. రోజూ రాష్ట్రంలో 40లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో మహిళల సంఖ్య 12 నుంచి 14 లక్షలు. యాజమాన్యం విస్తృతంగా చర్చించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. మహిళలు సామూహిక ప్రయాణం చేసేందుకు ఉచితంగా బస్సుల అనుమతింపబడవు” అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

Also Read : నిజమైన తెలంగాణ వచ్చింది.. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి : జీవన్ రెడ్డి