Congress victory : కాంగ్రెస్ విజయోత్సవ వేళ డిస్కౌంటు ధరపై చికెన్ విక్రయం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఓ కాంగ్రెస్ వీరాభిమాని తన చికెన్ దుకాణంలో డిస్కోంటు ధరకు చికెన్ విక్రయిస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామంలో వెలుగుచూసింది....

Congress victory : కాంగ్రెస్ విజయోత్సవ వేళ డిస్కౌంటు ధరపై చికెన్ విక్రయం

chicken

Congress victory : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఓ కాంగ్రెస్ వీరాభిమాని తన చికెన్ దుకాణంలో డిస్కోంటు ధరకు చికెన్ విక్రయిస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామంలో వెలుగుచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు విజయం సాధించి సంబరాలు జరుపుకుంటుండటంతో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చికెన్‌ వ్యాపారి నరుకుళ్ల రాఘవరావు డిస్కౌంటు ధరకు చికెన్‌ విక్రయిస్తున్నారు.

ALSO READ : Congress six guarantees : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

పెనుబల్లి మండలంలోని కారాయిగూడెంలో నరుకుళ్ల రాఘవరావు అనే వ్యాపారి చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. తాను కాంగ్రెస్‌ అభిమానినని, పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి సెగ్మెంట్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మట్టా రాగమయిల గెలుపును విభిన్నంగా జరుపుకోవాలనుకున్నానని నరుకుళ్ల రాఘవరావు చెప్పారు. మంగళవారం, బుధవారాల్లో కిలో చికెన్‌ డిస్కౌంటు ధరపై రూ.120 చొప్పున విక్రయించారు.

ALSO READ : Telangana Congress Government : తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు

కారాయిగూడెం గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. ఇతర దుకాణాల్లో కిలో చికెన్ రూ.150 నుంచి రూ. 160 వరకు విక్రయిస్తుండగా, రాఘవరావు కాంగ్రెస్ విజయోత్సవం సందర్భంగా తక్కువ ధరకు చికెన్‌ను విక్రయించారు. దీంతో చికెన్ ను కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు, ఇరుగుపొరుగు ప్రాంతాల వాసులు ఆయన దుకాణానికి తరలివచ్చారు. కాంగ్రెస్ విజయోత్సవ వేళ డిస్కౌంటు ధరకు చికెన్ విక్రయించిన కాంగ్రెస్ అభిమాని ఉదంతం చర్చనీయాంశంగా మారింది. డిస్కౌంటు ధరకు చికెన్ లభించడంతో ప్రజలు బారులు తీరి కొనుగోలు చేసి లొట్టలేసుకొని తిన్నారు.