Gold price today
Gold Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తగ్గుకుంటూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారతీయ బులియన్ మార్కెట్లో సరికొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
భారత దేశంలో పెండ్లిళ్ల సీజన్ కావడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడం, ట్రంప్ తాజా టారీఫ్ ల నిర్ణయంతో పసిడి ధరలతో పాటు వెండి రేటు సామాన్యులకు భారంగా మారుతోంది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 128 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 5,106 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది.
బంగారం ధర గత మూడు నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తోంది. గురువారం నుంచి ఆదివారం వరకు 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.5వేలు పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. మరోవైపు వెండి రేటు గడిచిన నాలుగు రోజుల్లో రూ.30వేలు పెరిగింది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధర పెరిగింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,59,280కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,46,150కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,59,430కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,46,000కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,59,280 వద్దకు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,90,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.