×
Ad

Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. ఈరోజు గోల్డ్, సిల్వర్ ధరలు ఎంత తగ్గాయంటే.. ఫుల్ డీటెయిల్స్..

Gold Rate Today : గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది.

Gold Rate Today

Gold Rate Today : శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు. శుభ ముహూర్తాల తేదీల్లో వివాహాలు, గృహ ప్రవేశాలు, శుభసంకల్ప కార్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా పెండ్లిళ్లు భారీ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. దీంతో భారత దేశ వ్యాప్తంగా బంగారంకు డిమాండ్ పెరగనుంది. ఇదే సమయంలో బంగారం కొనుగోళ్లు సైతం భారీగా పెరిగే అవకాశం ఉంది.

Also Read : Rashmika Mandanna : విజయ్ తో పెళ్లి కోసం.. బాలీవుడ్ స్టార్ హీరో సినిమా వదులుకున్న రష్మిక..

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పొచ్చు. పలు దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను భారీగా కొనుగోళ్లు చేస్తుండం కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు.. డాలర్ విలువ తగ్గడంతోపాటు, అమెరికా రిజర్వు వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే భయంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ కారణంగానూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 77 డాలర్లు పెరగడంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,965 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ముఖ్యమైన నగరాల్లో గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారట్ల 10గ్రాముల బంగారం రూ. 1,54,190 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,340 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,490కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,54,340కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,41,340కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,54,190 వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,59,900కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,54,900 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,59,900 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.