Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇలాగైతే కొనలేం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా పలు నగరాల్లో బంగారం రేట్..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : March 19, 2025 / 02:23 PM IST
Gold
Gold And Silver Price: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం బంగారం, వెండి ధరలు పెరగ్గా.. బుధవారంసైతం ధరలు పెరిగాయి. దీంతో గోల్డ్ రేటు రూ.90వేల మార్క్ దాటింది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బుధవారం ఉదయం ఔన్స్ గోల్డ్ ధర 3,035 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర రూ.34.02 డాలర్లుగా ఉంది. దీంతో భారతదేశంలో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 440 పెరగ్గా.. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,400 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,590.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.90,400 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,14,000గా నమోదైంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,14,000గా నమోదైంది.
