Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్ వేళ మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్ లో 10గ్రాముల గోల్డ్ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : May 1, 2025 / 10:54 AM IST
Gold And Silver Price
Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ తో ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం మహిళలకు పెద్ద శుభవార్తేనని చెప్పొచ్చు. బంగారంతోపాటు వెండి ధరసైతం తగ్గుతూ వస్తోంది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 2,180 తగ్గింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 2వేలు తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.2వేలు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో గురువారం గోల్డ్ రేటు తగ్గింది. బంగారం ఔన్సు (31.10గ్రాముల) 80డాలర్లు తగ్గి గురువారం 3,227 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ సిల్వర్ 32.01 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం మహిళలకు ఊరటనిచ్చే అంశం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,730 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,880కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,730కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,07,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.98,000కు పడిపోయింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద కొనసాగుతుంది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.
