×
Ad

Gold Rates: వామ్మో ఇలాగైతే బంగారం ఎలా కొంటాం? పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది.

భారత్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధరల్లో రూ.100 తగ్గుదల కనపడింది. అంతర్జాతీయంగానూ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారంలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి 80 వేల రూపాయలకు మించి ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,710గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,050గా ఉంది.

Gold

ఢిల్లీ, ముంబైలో..

ఢిల్లీలోనూ బంగారం ధర రూ.10 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,860గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,200గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.80,710గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,050గా ఉంది

వెండి ధరలు

దేశంలో వెండి ధరల్లో రూ.100 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,00,400గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,00,400గా ఉంది