Gold Rates: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు..
- Harishth Thanniru
- Published On : March 27, 2025 / 10:45 AM IST
Gold Rate
Gold And Silver Price: బంగారం కొనేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బ్యాడ్ న్యూస్.. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. బుధవారం 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.110 పెరగ్గా.. ఇవాళ రూ.440 పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.440 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 400 పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. బుధవారం కిలో వెండిపై వెయ్యి పెరగ్గా.. ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటు పెరిగింది. బుధవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,017 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ (గురువారం) 15డాలర్లు పెరిగి.. ఔన్సుకు 3,032 డాలర్లకు చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 33 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,840కి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,990కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,350 కాగా.. 24క్యారెట్ల ధర రూ.89,840 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,02,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద కొనసాగుతుంది.
