Gold Price: న్యూఇయర్ వేడుకల వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
- Harishth Thanniru
- Published On : December 31, 2024 / 10:43 AM IST
Gold
Gold And Silver Price: 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 440 తగ్గగా.. కిలో వెండిపై రూ. 1,900 తగ్గుదల చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా ధరలు తగ్గడంతో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100కు చేరగా..
10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,560 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,250 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,710.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.71,100 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,560.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,100 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 77,560 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా మంగళవారం వెండి ధర భారీగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.98,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 98,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 90,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,500 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
