Gold and silver Price: పండుగ వేళ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర
- Harishth Thanniru
- Published On : October 11, 2024 / 12:10 PM IST
Gold
Gold And Silver Price Today: వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 700 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. తగ్గినట్లే తగ్గి మళ్లీ గోల్డ్ రేటు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు షాకవుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,950కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,400కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,550.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.70,950 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,400.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,950 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.77,400కు చేరింది.
వెండి ధర ఇలా ..
శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,02,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,02,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ.96,000 వద్దకు చేరింది.
బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి ధర 85,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
